Home » Devotional » Today Horoscope January 07 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 07 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 6, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మంచి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. అన్ని రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. చిల్లర, కూరగాయల వ్యాపారాలు బాగా నడుస్తాయి. మహిళలకు ఆనందం. శ్రీదుర్గా దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. ఊహించిన ఫలితాలు సాధిస్తారు. అన్ని వైపుల నుంచి మీకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. విచిత్రంగా ఈరోజు గడుస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. ఆర్థికంగా సంతోషం నిండిన రోజు. మహిళలక లాభాలు. అమ్మవారిని ఆరాధించండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో చికాకులు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అలసట, శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఇబ్బందులు.అనారోగ్య సమస్యలు. ధనం లేక ఇబ్బంది పడుతారు. మహిళలకు ఇంట్లో చికాకులు. శ్రీదుర్గా సూక్తంతో అమ్మవారిని ఆరాధించండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మీరు అనుకున్నవి ముందుకు పోవు. ప్రతి విషయంలోను బాగా శ్రమించాల్సిన సమయం. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మహిళలకు ఒత్తిడులు. శ్రీలక్ష్మీ అరాధన చేయండి.

Today Horoscope january 07 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తాయి. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు శుచితో జపించండి.

కన్యరాశి ఫలాలు : అనుకోని ధనలాభం కలుగుతుంది. పాలు, కూరగాయలు, పండ్లు పూల వ్యాపారులకు మంచి రోజు. చాలా కాలంగా ఉన్న బాధలు తీరుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. మంచి వార్తలు వింటారు. మహిళలకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ప్రతి విషయంలో మందగమనం. మీకు మీరే విసుగు తెచ్చుకుంటారు. అనుకోని ఆటంకాలు. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు. కుటుంబంలో సమస్యలు. ప్రయాణాలు కలసిరావు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీకనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని బాధలు,. విపరీతమైన వత్తిడి. అనుకోని ఖర్చులు. రావాల్సిన ధనం సమయానికి రాక ఇబ్బంది పడుతారు. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టాలు. కుటుంబంలో మార్పులకు అవకాశం. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీసూక్తంతో అమ్మవారి పూజ చేయండి.

దనుస్సు రాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా సంతోషంగా ఉంటుంది. పెద్దల నుంచి సహయం అందుతుంది. పూర్వ ఆస్తులకు సంబంధించి మంచి వార్తలు వింటారు. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకమైన రోజు. మహిళలకు విశ్రాంతి లభిస్తుంది. శ్రీలలితా సహస్రనామాలను వినండి.

మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మాటపట్టింపులు. లాభాలు అందుకుంటారు కానీ ఖర్చులు పెరిగి లాభాలు కనిపించవు. బంధువుల రాకతో బిజీగా గడుపుతారు. కుటుంబంలో మాటపట్టింపులు. మహిళలకు అలసట, మాటలు పడాల్సి రావచ్చు. విద్యార్థులు, వ్యాపారస్తులకు బాగాశ్రమ. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటుంది ఈరోజు. మీరు పనులను అతి వేగంగా పూర్తిచేస్తారు. పెద్దల నుంచి ప్రశంసలు,. ఆఫీస్‌లో కోరుకున్న స్తానానికి బదిలీ అవకాశం లేదా పదోన్నతి. విద్యార్థులకు కార్యసిద్ధి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. మహిళలకు సంతోషంగా ఉంటుంది. అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి,

మీనరాశి ఫలాలు : కొంచెం ఇబ్బంది. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. సోదరి లేదా సోదరులతో వివాదాలు. ప్రయాణాలు చేసి విసుగు చెందుతారు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఇంటా, బయటా పని భారం పెరుగుతుంది. మహిళకు శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి