Zodiac Signs : జనవరి 18 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 January 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు. తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మిత్రుల కలయిక కొంత ప్రశాంతత వస్తుంది. అనుకోని చికాకులుమహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శుభ ఫలితాల ఫలితాల కోసం శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన లేదా గుడిలో ప్రదక్షణలు చేయండి.
వృషభరాశి ఫలాలు : మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబం వ్యవహారాలు సంతోషంగా ఉంటాయి. ధనలాభాలు వస్తాయి, వ్యాపార లావాదేవీలతో ఆనందం. పాత ఆస్తి సంబంధ శుభ వార్తలు వింటారు. బంధువులతో సఖ్యత. మహిళలకు ప్రశంసలు, ఉత్సాహం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు, ఆర్థిక సమస్యలు రావచ్చు. ఖర్చులు బాగా పెరిగే సూచన కనిపిస్తుంది. మాట పట్టింపులతో మానసిక అశాంతి. స్నేహితుల ద్వారా మోసం జరిగే అవకాశం ఉంది. మహిళలకు చికాకులు. హనుమాన్‌ చాలీసా పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది. కర్కాటకరాశి ఫలాలు : అన్నింటా విజయం. సంతృప్తితో ఈరోజు గడుపుతారు. ప్రయాణాలతో ప్రయోజనాలు. ఆర్థిక పరిస్థితితో ఉత్సాహం. విద్యార్థులు ఈరోజు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు ఆశావహమైన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

Today Horoscope january 18 2022 check your zodiac signs

Today Horoscope january 18 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : మంచి ఆహారం, విహారం. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు. శత్రువులు మిత్రులుగా మారుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థితి. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు. మహిళలకు విశ్రాంతి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : అనారోగ్య సమస్యలు రావచ్చు. పని వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు. ఉద్యోగులకు ఆఫీస్లో తీవ్ర నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు. విద్యార్థులకు పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. శుభ ఫలితాల కోసం లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక వాతావరణంనలో గడుపుతారు. వ్యాపారాలలో ఆటుపోటులు. ఆర్థిక ఇబ్బందులు. మనస్సులో కలత. విశ్రాంతి లేక అలసిపోతారు. మహిళలకు పెద్దల ద్వారా సమస్యలు రావచ్చు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. అన్నింటా విజయం సాధిస్తారు. విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. విదేశీ బంధువుల నుంచి శుభ సమాచారం. అనుకోని ఖర్చులు వస్తాయి కానీ వాటిని అధిగమిస్తారు. మహిళలకు మంచి రోజు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : శుభకరమైన రోజు. మీరు గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం. మహిళలకు ధనలాభం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన విధంగా ఉండవు. పాలు, కూరగాయల వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. విద్యార్థులు, ఉద్యోగులకు నిరాశ. మహిళలకు విశ్రాంతి దొరకదు. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి.

కుంభరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. పనులు నెమ్మదిగా చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది పెడుతాయి. విద్యార్థులకు, వ్యాపారులకు బాగా శ్రమించాల్సిన రోజు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. ధనం ప్రవహిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. పరీక్షల్లో విజయం. మహిళలకు కీర్తి. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి