Zodiac Signs : జనవరి 22 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 21 January 2022, 10:40 pm

మేష రాశిఫలాలు : శుభకరంగా ఉంటారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయిజ వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. మహిళలకు సంతోషం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి వృషభ రాశిఫలాలు : అనుకోని ఇబ్బందులు. శ్రమ పెరిగినా ఫలితం అనుకున్నంత ఉండదు. అనుకోని ప్రయాణాలు. నష్టాలతో వ్యాపారులు ఇబ్బందులు. ఆర్థిక మందగమనం. మహిళలకు శ్రమ పెరుగుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి,

మిధున రాశి ఫలాలు : ఈరోజు శుభంగా ఉంటుంది. ఆఫీస్లో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని లాభాలు వస్తాయి. మహిళలకు మంచి వార్తలు వింటారు. శ్రీలక్ష్మీరమణ ఆరాధన చేయండి.  కర్కాటక రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని నిర్ణయాలు తీసుకోని ఇబ్బంది పడే అవకాశం. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పిల్లల ద్వారా చికాకులు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Today Horoscope january 22 2022 check your zodiac signs

Today Horoscope january 22 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : మంచి పనులతో ముందుకు పోతారు. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. దూరపు మిత్రులు లేదా బందువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలకు మంచిరోజు. మహిళలకు వస్త్రలాభాలు. దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితం వస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మార్పులకు అవకాశం కనిపిస్తుంది. పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. ప్రయాణ చికాకులు కనిపిస్తున్నాయి. మహిళలకు ఆరోగ్య భంగం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులరాశి ఫలాలు : ఈరోజు తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మహిళలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శుభవార్త ను వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. సంతోషంగా ఈరోజు గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : ఈరోజు శుభంగా ఉంటుంది. చేసే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు, ఆర్తికంగా పురోగతి. మహిలలకు ధనలాభం. విద్యార్థులకు శుభ ఫలితాలు.శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనుకోని నష్టాలు. ప్రయాణ సూచన. పెద్దల సలహాలు లేనిదే ఈరోజ ఏపని చేయవద్దు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు.మహిళలకు ఆరోగ్యం బాగా ఉంటుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈ రోజు కొంచెం లాభం, కొంచెం నష్టం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు నష్టాలు వస్తాయి. ఆర్థిక మందగమనం. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి

మీన రాశి ఫలాలు : ఈరోజు లాభాలు వస్తాయి. ఆర్థికంగా వృద్ధి. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం. అన్ని పనులు సజావుగా సాగుతాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి