Zodiac Signs : జనవరి 28 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Devotional Desk | The Telugu News | Updated on: January 27, 2022, 10:44 pm

మేష రాశి ఫలాలు : కొంచెం ప్రతికూలతలతో కూడిన రోజు ఇది. అనుకోని ధననష్టాలు రావచ్చు జాగ్రత్త. కుటుంబంలో అనారోగ్య సూచనలు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. మహళలు ఓపికతో మెలగాల్సిన రోజు. ఆర్థిక సమస్యలు. వ్యాపారాలు సాధారణం. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషం నిండిన రోజు. ఇంటాచ బయటా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రతిబను గుర్తిస్తారు. మహిళలు ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతరాధ చేయండి.

మిధున రాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఇంట్లో సభ్యులతో గడుపుతారు. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. వ్యాపారలావాదేవీలు సాఫీగా సాగుతాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మహిళలకు సంతోషం. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉండదు. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. వ్యాపారాలు పెద్ద లాభాలు రాకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. కుటుంబంలో వివాదాలు. ప్రయాణ చికాకులు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ కామాక్షీ అమ్మవారిని లలితా అష్టోతరంతో పూజచేయండి.

Today Horoscope january 28 2022 check your zodiac signs

Today Horoscope january 28 2022 check your zodiac signs

సింహ రాశిఫలాలు : శుభవార్త శ్రవణం. అనుకోని లాభాలు వస్తాయి. ప్రయాణల వల్ల ప్రయోజనాలు. పాలు, కూరగాయలు, మందుల వ్యాపారులకు లాభాలు వస్తాయి. అనుకోని అతిథితో ఇంట్లో సందడి. ఇష్టదేవతారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : సకాలంలో పనులు పూర్తిచేస్తారు. అనుకొని లాభాలు వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా, బయటా మీకు తిరుగు ఉండదు అన్న విధంగా ఉంటుంది ఈరోజు. కీర్తి పెరుగుతుంది. మహిళలకు శుభవార్త శ్రవణం. అమ్మవారి కుంకుమ ధరించి, లలితా సహస్రనామాలను వినండి.

తుల రాశి ఫలాలు : కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని వారి నుంచి చెడువార్తలు వింటారు. శత్రు బాధలు పెరుగుతాయి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆటంకాలతో ఈరోజు ముగుస్తుంది. మహిలలకు శ్రమ పెరుగుతుంది. శ్రీదుర్గా సూక్తంతో పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. పెద్దల సహాయంతో ముందుకు పోతారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యనిర్ణయాలు తీసుకోనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకోని ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంలో మార్పులు. విజయం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. షేర్‌, ట్రేడింగ్‌ కలసి వస్తుంది. అనుకోని శుభవార్తలను మహిళలు వింటారు.

మకర రాశి ఫలాలు : మీ తెలివితేటలకు పదును పెడుతారు. పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. వేగంగా ఆలోచించి ముందుకు పోతారు. విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం. ఆర్థికంగా పురోగతి. శుభదినం ఇష్ఠ దేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : సమాజంలో మీకు మంచి ఆదరణ లభించే రోజు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో మీకు అందరి సహకారం లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.శ్రీ మాత్రేనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మీన రాశి ఫలాలు :  కుటుంబంలో మంచి వాతావరణం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఐరన్‌, హార్డ్‌వేర్‌ రంగాల వారికి సానుకూలమైన రోజు. సాఫ్ట్‌వేర్‌ వారికి మంచిరోజు. మహిళలకు స్వర్ణ లాభం. ఇష్టదేవతరాధన చేయండి.

Devotional Desk

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp