Zodiac Signs : జూలై 01 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 30 June 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : చక్కటి ఉత్సాహంతో ముందుకుపోతారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అన్ని రకాల రంగాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
వృషభరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు వస్తాయి, ఆదాయం తగ్గుతుంది. అన్నింటా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన రోజు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. ధైర్యంతో ముందుకుపోతారు. అనుకోని అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణ సూచన కనిపిస్తుంది. తెలియని అంతర్గత శత్రువుల నుంచి ఇబ్బందులు. శ్రీ దుర్గా దేవి ఆలయంలో ప్రదక్షణలు చేయండి,.
కర్కాటక రాశి ఫలాలు : చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అన్నింటా జయం సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope July 01 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 01 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. పెద్దల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్య భంగం. శ్రీ మహాకాళీ ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి శుభదాయకంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో వారు మీకు మద్దతు ఇస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి, దీర్ఘకాలిక పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అన్ని పనులలో, జాప్యం పెరుగుతుంది. శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకున్నంత లాభాలు రావు కానీ పర్వాలేదు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కనిపిస్తుంది. అనుకోని వారి ద్వారా శుభవార్తలు వింటారు. మహిళలకు పనివత్తిడి పెరగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : శుభకరమైన రోజు. మంచి వార్తలు వింటారు. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. విద్య, ఉద్యోగ విషయాలలో శుభ ఫలితాలు. ఇంట్లో శుభకార్య యోచన కనిపిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : మీరు ఆశించిన మేరకు పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోష వాతావరణం. మహిళలకు స్వర్ణలాభాలు. విద్య, వ్యాపారాలలో శుభ ఫలితాలు. కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొంచెం శుభం, కొంచెం చెడు ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. కార్యలయంలో ఒత్తిడులు. ప్రయాణ సూచన. మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అనారోగ్యం తగ్గుతుంది. ఇంట్లో, బయటా అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. మహిళలకు స్వర్ణ, వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీ అష్టోతరంతో అమ్మవారి పూజ చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  2. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  3. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  4. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  5. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  6. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  7. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి