Zodiac Signs : జూలై 02 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: July 1, 2022, 10:54 pm

మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి సహకారం లభిస్తాయి. సమాజంలో మంచి పేరు కీర్తి లభిస్తాయి. విద్య, ఉద్యోగ విషయాలలో అనకూలత కనిపిస్తుంది. మహిళలకు వస్తులాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా మందగమనం. ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతాయి. పెద్దల ద్వారా చెడు వార్తలు వింటారు. ఇంట్లో సమస్యలు వస్తాయి. అనుకోని నష్టాలు వస్తాయి. వ్యాపారాలు ఇబ్బందులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఆర్థికంగా సాదారణ పరిస్థితి. ఇబ్బందులను ధైర్యంగా ఎదురుకొంటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి శుభవార్త శ్రవణం జరుగుతుంది., ఆదాయం పెరుగుతుంది. బంధువులతో ప్రయోజనాలు పొందుతారు. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబుడలకు అనుకూలమైన రోజు. ఇంట్లో శుభకార్య యోచన. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope July 02 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 02 2022 Check Your Zodiac Signs 

సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోని నష్టాలు వస్తాయి. దీర్గకాలిక సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. మహిళలకు పనిభారం. శ్రీ ఆంజనేయరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనకూలం. అనుకోని లాభాలు వస్తాయి. చాలాకాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. మహిళలక స్వర్ణలాభాలు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన సమయం. ఆర్థికంగా ఇబ్బందులు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు వస్తాయి. అనకోని ఖర్చులు పెరుగుతాయి. విద్యా, ఉద్యగో విషయాలలో జాగ్రత్తలు అవసరం. మహిళలకు చికాకులు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం తగ్గుతుంది కానీ ఇబ్బంది ఏమీ ఉండదు. వ్యాపారాలలో సాధారణ స్థితి. వ్యయప్రయాసలకు గురవుతారు. ధైర్యంతో, తెలివితేటలతో ముందుకుపోతారు. మహిళలకు మంచి ఫలితాలు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంటారు. విశ్రాంతి లభిస్తుంది. విందులు, వినోదాలకు అవకాశం ఉంది..మహిళలకు సంపాదన పెరుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. వైవాహిక జీవతం సాఫీగా సాగుతుంది.. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : అనుకూలమైన రోజు. వివాహల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ధన లాభాలు వస్తాయి. పై అధికారుల వల్ల ప్రశంసలు. ప్రయాణ సూచనలు. ఆర్థికంగా ఇబ్బంది తగ్గుతుంది. మహిళలకు లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : అరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆదాయ మార్గాల పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు సాధిస్తారు. మహిళలకు అనుకోని లాభాలు. ప్రయాణ సూచన. కుటుంబంలో సానుకూలమైన మార్పు. శ్రీ విష్ణు సహస్రనామాలకు పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆస్తి సంబంధ విషయాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. మహిళలకు అనుకోని లాభాలు. విద్య, ఉద్యోగ విషయాలలో లాభాలు. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp