Home » Devotional » Today Horoscope July 03 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూలై 03 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 2, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మంచి మంచి అవకాశాలు వస్తాయి సద్వినియోగం చేసుకోవాల్సిన రోజు. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు. దూరప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అనకూలత కనిపిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారాలలో సానుకూలమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు సాధిస్తారు. విజయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు ఇంట్లో శుభవార్తలు అందుతాయి. శ్రీ ఆదిత్యహృదయం పారాయణం చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : చాలా శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా మందగమనం కనిపిస్తుంది. అన్నింటా నిరాశగా ఉంటుంది. ప్రోత్సాహం కరవుతుంది. ఆప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. అనవసర తిరుగుడు కనిపిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చెడు, మంచి కలయికతో కూడిన రోజు. ఆనందంగా గడుపుతారు. సాయంత్రం కొన్ని చెడు వార్తలు వింటారు. విందులు, వినోదాలకు అనవసర ఖర్చులు చేసి తర్వాత బాధ పడుతారు. విద్య, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలత తక్కువగా ఉంది. శ్రీ అనుజ్ఞ గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope July 03 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : వివాదాలకు ఆస్కారం ఉంది. అన్నింటా అనుకోని పరిస్థితులు ఏర్పడుతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారాలలో ఆశించిన మేర ఫలితాలు సాధించలేరు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. శ్రీ చింతామణి గణపతి ఆరాదన చేయండి.

కన్యారాశి ఫలాలు : చక్కటి శుభదినం. అన్నింటా విజయం సాధిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. దీర్గకాలిక సమస్యల నుంచి బయట పడుతారు. విద్య, వ్యాపారాలలో అనకూలమైన రోజు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు చేసిన పనులలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి వార్తలు అందుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆర్థికంగా చక్కటి శుభదినం. వ్యాపారాలలో అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్య, ఉద్యోగం అన్నింటా సానుకూల ఫలితాలు వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చికాకులు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంట్లో శుభకార్యా సూచన. ఆర్థికంగా పర్వాలేదు. విలువైన వస్తువులు కొంటారు. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ దుర్గా, సరస్వతి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. చక్కటి శుభ దినం. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్య, ఉద్యోగ, బంధుత్వ విషయాలలో మంచిగా ఉంటుంది. మహిళలకు ధనలాభాలు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్రీ సూర్య ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అన్నింటా చికాకులు ఎక్కువ అవుతాయి. ఓపిక, సహనం చాలా అవసరం. ధనం విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యయప్రయసలతో కూడిన రోజు. మహిళలకు పనిభారం. దూరప్రయాణ సూచన. అనుకోని వివాదాలు మాటపట్టింపుల వస్తాయి. ఇష్టదేవతారాధన తోపాటు అమ్మవారి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి