Zodiac Signs : జూలై 11 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జూలై 11 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :10 July 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : ఆర్థికంగా మందగమనం. అనుకోని ఖర్చులు వస్తాయి. ఊహించిన విధంగా పరిస్థితి ఉండదు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువ. వ్యాపారాలలో చికాకులు వస్తాయి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు. మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధన సంబంధ విషయాలలో చికాకులు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడుతారు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాదన చేయండి.

Today Horoscope July 11 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 11 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ధనసంబంధ విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడి లాభాలు వస్తాయి. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. రియల్‌ రంగాలలో పెట్టుబడులకు మంచిరోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అన్నింటా శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాల కోసం కొత్త అన్వేషిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైనది. మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అన్ని రంగాల వారికి సానుకూలమైన రోజు. శ్రీ శివాభిషేకం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు.అన్ని విషయాలలోఅనుకూలతలు కనిపిస్తున్నాయి. శ్రీ అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి శుభ వార్తలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. చాలా కాలంగా పెండింగ్‌ పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు లాభాలు. శ్రీ రుద్రాభిషేకం చేయండి.

మకర రాశి ఫలాలు : అన్ని పనులు సకాలంలో పూర్తి చేయలేరు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. విదేశీ విద్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు వస్తాయి. మహిళలకు కొంత మనఃశాంతి కొరవడుతుంది. శ్రీ లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : అనుకోని పనులు పడటం వల్ల విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. ఆదాయం తక్కువతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు ఈరోజు మంచిది కాదు. అన్ని విషయాలలో చికాకులు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : చాలా చక్కగా ఉంటుంది ఈ రోజు. పనులలో వేగం పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. వివాదాలు సమసిపోతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది