Zodiac Signs : జూలై 14 గురువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అన్నింటా జయం దొరుకుతుంది. అప్పులు తీరుస్తారు. తల్లిదండ్రుల ద్వారా శుభవార్తలు వింటారు. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆటంకాలు వస్తాయి. వాటిని ధైర్యంగా అధిగమించాలని విశ్వాసంతో ముందుకుపోతారు. మహిళలకు అనవసర తగాదాలకు అవకాశం ఉంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు వస్తాయి. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్ని వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. విద్యార్థులకు కార్యజయం. ఇంట్లో ధన సంబంధ విషయాలలో చర్చలు చేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో చికాకులు తగ్గుతాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
సింహ రాశి ఫలాలు : అన్నింటా శ్రమ పెరుగుతుంది, విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి. ఆర్థిక పురోగతి అనుకున్నంత ఉండదు. పని వత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకున్న పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆస్తి సంబంధ విషయాలలో సంతృప్తికరంగా ఉంటుంది. మహిళలకు అనుకున్నంత లాభదాయకం కాకున్నా మంచి వార్తలు వింటారు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యం పెరుగుతుంది. వివాదాలకు ఆస్కారం ఉంది. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టాలు వస్తాయి. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త వ్యవహరించాలి. మహిలలకు పని భారం. శ్రీ ఆంజనేయాస్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూల మార్పులు జరుగుతాయి. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : కష్టంతో కూడిన రోజు. మంచి చేద్దామన్న చెడుగా మారుతుంది. అనుకోని ప్రయాణాల వలన ఇబ్బందులు. అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. ఆస్తి సంబంధ విషయాలలో ఇబ్బందులు. మహిళలకు పనిభారం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మీరు చేసే పనులలో సానుకూలత కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. అనుకోని వ్యయప్రయాసలు. కుటుంబంలో మార్పులు. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
కుంభ రాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. మిత్రుల ద్వారా ఆదాయం పెంచుకుంటారు, మహిళల ద్వారా ఇబ్బందులు పడుతారు. కుటుంబంలో సానుకూల మార్పులు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మంచిరోజు. శుభ వార్తలు వింటారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్య, ఉపాధి విషయంలో అనుకూలత కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు చక్కటి లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.