Home » Devotional » Today Horoscope July 16 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూలై 16 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 15, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి, ఆశించిన రీతిలో పనులు ముందుకు సాగవు. ఆశ నిరాశలతో ఈరోజు గడస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అన్ని రకాల వ్యాపారాలు, వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షలను, పూజ చేయండి మంచి ఫలితం వస్తుంది. వృషభ రాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అన్నింటా జయం కలుగుతుంది. విద్యా, ఉద్యోగ, ఉపాధి విషయాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. ఇంట్లో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. ఇష్టదేవతరాదన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : కొంచెం శ్రమించాలి. కానీ చివరకు అనుకున్నదాన్ని సాధిస్తారు. ఆదాయం విషయం సాధారణంగా ఉంటుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణ లాభాలు. మహిళలకు ధనలాభాలు. శుభకార్య యోచన. హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.కర్కాటక రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దీర్గకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మహిళలకు లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

Today Horoscope July 16 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాలి. అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంటా, బయటా మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమించాలి. పెట్టుబడులకు అంత అనుకూలం కాదు. పెద్దల సలహాలు లేకుండా నిర్ణయం తీసుకోవాలి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రోజు. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు లాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మీరు బాగా శ్రమించాల్సిన రోజు. ఆదాయం తగ్గుతుంది. కానీ అవసరానికి మాత్రం మీకు ధనం చేతికి అందుతుంది. విద్యా, ఉపాది విషయాలలో కష్టపడాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో అనుకోని మార్పులు వస్తాయి. వివాదాలకు అవకాశం ఉంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత విశ్రాంతి లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయలేక పోతారు. చికాకులు వస్తాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. కుటుంబం సభ్యుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. మహిళలకు శుభదాయకమైన రోజు. రామాలయం లేదా ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభవార్తలు వింటారు. ఆదాయ పురోగతి కనిపిస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. మంచి పనులు ప్రారంభిస్తారు. రియల్‌ ఎస్టేట్లో పెట్టుబడికి అనుకూలత. అమ్మతరపు వారి నుంచి లాభాలు వస్తాయి. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : చాలా సంతోషంగా ఈరోజు గడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. మిత్రుల ద్వారా లాబాలు వస్తాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు ; అన్నింటా ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు వస్తాయి. బంగారు,.విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంటా, బయటా మీపై పని వత్తిడి పెరుగుతుంది. వ్యయప్రయాసలతో కూడిన రోజు. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం తగ్గి ఇబ్బంది పడుతారు. అవసరానికి మిత్రులు ఆదుకుంటారు. అన్నదమ్ముల నుంచి సహయసహకారాలు అందుతాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వాహనాలను నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధువుల నుంచి చెడు వార్తలు వింటారు. మహిళలకు లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి