Home » Devotional » Today Horoscope July 23 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూలై 23 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 22, 2022, 10:42 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు వ్యాపారాలలో లాభాలను సాధించబోతున్నారు. ఆర్థిక విషయాలోల మాత్రం సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం మద్యస్తంగా ఉంటుంది. వత్తిడి పని భారం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు అంత అనుకూలం కాదు. ప్రేమికులకు ఇబ్బందులు వస్తాయి. మనఃశాంతి కరువౌతుంది. శ్రీ ఆంజనేయాస్వామి ఆరాధన, చాలీసా పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ధనం విలువ ఈరోజు తెలుస్తుంది. కెరీర్‌ పరంగా ఈరోజు చాలా శ్రద్ద అవసరమైన రోజు. ఆరోగ్యం కోసం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని ఖర్చులు వస్తాయి, ఆదాయం తగ్గుతుంది. వ్యయప్రయాసలతో కూడిన రోజు. తల్లిదండ్రుల నుంచి మంచి సలహాలు, సూచనలు అందుతాయి. సింధూర ధారణ, చాలీసా పారాయణ చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ప్రేమికులకు చక్కటి రోజు. ప్రయాణాలతో సంతోషాన్ని పొందుతారు. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అన్ని సవ్యంగానే సాగుతాయి. ఆర్థిక పరిస్తితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మహిళలకు శుభ వార్తలు అందుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాదన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. అదృష్ఠం కలసి వస్తుంది. పనుసు రంగుతో మంచి జరుగుతుంది. కెరీర్‌ పరంగా చక్కటి శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. ఇంటా, బయటా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన రోజు. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

Today Horoscope July 23 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : ఆర్థికంగా చక్కటి సంతోషకరమైన ఫలితాలు వస్తాయి. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగంలో మంచి వార్తలు వింటారు. ప్రేమికులకు ఈరోజు సమయం తెలియనంతగా కాలం గడిచిపోతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సలహాలు పాటించి లాభాలు గడిస్తారు. మిత్రులతో విహారయాత్రలను ప్లాన్‌ చేస్తారు. మనఃశాంతి లభిస్తుంది. కొత్త అవకాశాలను అందుకుంటారు. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అన్నింటా విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ కొన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమతో కూడిన విజయం వరిస్తుంది. ఆదాయం కొంత పెరుగుతుంది. ధైర్యంతో ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి, ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న దాని కంటే ముందే పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని భారం పెరిగినా సులువుగా పనులు పూర్తిచేస్తారు. అన్నింటా మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చాలా కాలంగా వేచి చూస్తున్న శుభ వార్తలు వింటారు. మీరు ఇష్టపడే వారితో కలసి ప్రయాణం చేస్తారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిప్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఇంటా, బయటా అనుకోని మార్పులు సంభవిస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. ప్రేమికులకు ఉత్సాహంగా ఉంటుంది. శ్రీ హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకర రాశి ఫలాలు : అన్నింటా మీరు కొంత కష్టపడాల్సిన రోజు. ప్రతి పనిలోనూ శ్రమించి విజయం సాధిస్తారు. సమాజంలో జరుగుతున్న మార్పులకు మీరు తగ్గట్టు మారాల్సిన రోజు. వ్యాపారాలలో లాభాలు తక్కువగా వస్తాయి. అమ్మ తరపు వారి నుంచి ఇబ్బంది వస్తుంది. మహిళలకు మాటపట్టింపులు వస్తాయి. శ్రీ నారాయణ స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. కెరీర్‌ పరంగా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. ప్రేమికులకు అనుకూలమైన రోజు. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారానికి అనుకూలమైన రోజు. విద్యార్థులు, మహిళలకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి మంచి ఫలితాలను పొందుతారు.

మీనరాశి ఫలాలు : దీర్షకాలిక పెట్టుబడులకు అనకూలమైన రోజు, ప్లాట్లు, భూములు కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. విదా, ఉపాధి విషయాలలో చక్కటి శుభకరమైన వార్తలు. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. అన్నింటా శుభ ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి