Zodiac Signs : జూలై 28 గురువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేష రాశి ఫలాలు : అనుకోని పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. మహిళలకు అనుకోని వత్తిడి ఏర్పడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. గోవులకు నాన బెట్టిన శనగలను పెట్టండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని మార్పులు సంభవిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలకు లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : చాలా కాలంగా ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతుంది. అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తారు. ఇంట్లో, బయటా అనుకోని లాభాలు కలుగుతాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి. శ్రీలక్ష్మీకుబేర ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చిరకాల కోరికలు నెరవేరకపోవడం వల్ల చికాకులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. ప్రయాణ సూచన ఉంది. పొరుగువారితో ఇబ్బందులు రావచ్చు. మహిళలకు పనిభారం. శ్రీ దత్తకవచం పారాయణం చేయండి.
సింహ రాశి ఫలాలు : పెద్దల సలహాలతో ముందుకుపోతారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి శుభకరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొంచెం లాభాలు వస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అధిక ఖర్చులు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేకూరుతుంది. కానీ సంతృప్తి లభించదు. విద్యా, ఉపాధి విషయాలలో చికాకులు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి చికాకులు పెరుగతాయి. శ్రీ లలితాదేవి సహస్రనామాలన ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అన్నింటా శుభకరమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా సంతోషకరమైర వార్తలు వింటారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.ఆఫీస్‌లో ప్రమోషన్‌కు అవకాశాలు ఉన్నాయి.రియల్ ఎస్టేట్‌లో లాభాలు పొందుతారు. శ్రీ గురుచరిత్ర వినడం, పారాయణం చేయడం చేయండి.,
ధనస్సు రాశి ఫలాలు : మంచి చేద్దామనుకుంటే చెడుగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని మార్పులు మీకు బాధ కలిగిస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతారు. శ్రీ కాలభైరవాష్టం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : అన్నింటా శుభకరమైన ఫలితాలు సాధిస్తారు. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. శత్రువుల బాధలు తీరుతాయి. మీరు వారిపై పై చేయి సాధిస్తారు. తెలివితేటలతో ముందుకు పోతారు. శ్రీ శక్తి గణపతి రాఆధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమామిశ్రమ ఫలితాలు వస్తాయి. పక్కవారితో సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. ఇంట్లో మహిళలకు ఒత్తిడి పెరుగుతుంది. గోవులకు పచ్చిదాన, పేదలకు ఆహార పదార్తాలు పెట్టడం చేయండి.
మీన రాశి ఫలాలు : పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అన్నింటా శుభఫలితాలు సాదిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత పెరుగుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.