Zodiac Signs : జూన్  03 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: June 3, 2022, 12:50 am

మేషరాశి ఫలాలు : శుభపరిణామాలు జరుగుతాయి. అన్నింటా జయం కలుగుతుంది. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృషభ రాశి ఫలాలు : మంచి రోజు. అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. పనిభారం పెరిగినా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆస్తి విషయాలలో అనుకూలంగా ఉంటుంది. విలువైన ప్లాట్లు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం. రోజు గడుస్తున్నకొద్ది అనకూలత పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణం. అనుకోని వివాదాలకు ఆస్కారం. ప్రయాణ అలసట. శారీరక శ్రమతో చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. విందులు, వినోదాలకు హజరు అవుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. క్షేత్ర సందర్శనకు ప్లాన్‌ చేస్తారు. మంచి వాతావరణం. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope June 03 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 03 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : అనుకోని సమస్యలు చుట్టుముడుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా మందగమనం. మీరు చేసే పనికి తగిన ఫలితం రాదు. మహిళలకు అనారోగ్య సూచన. కుటుంబంలో చికాకులు. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : పర్వాలేదు అన్నట్లు ఈరోజు గడుస్తుంది. ఆశించిన మేర పనులు పూర్తిగావు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వివాదాలు వచ్చినా సమసి పోతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు, బంధువుల వల్ల ప్రయోజనాలు పొందుతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. అప్తుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలతో మీరు సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొంటారు. విదేశీ ప్రయాణ సూచన. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. మహిళలకు లాభాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

ఇది కూడా చ‌ద‌వండి

Vikram Movie Review : ‘విక్రమ్‘ ఫస్ట్ రివ్యూ ఇదిగో.. రెస్పాన్స్ సూపర్.. బ్లాక్‌బస్టరే..!

వృశ్చికరాశి ఫలాలు ; వివాదాలకు ఆస్కారం ఉంది. ఓపిక, సహనంతో మెలగాల్సిన రోజు. పాత బకాయిలు వసూలు కాక ఇబ్బంది పడుతారు. మధ్యవర్తిత్వం జోలికి పోవద్దు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. మహిళలకు మంచి రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : శుభకరమైన రోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆఫీస్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటారు. మంచి ప్రాజెక్టులలో పాల్గొంటారు. శుభ వార్తలు వింటారు. మహిలలకు స్వర్ణలాభ సూచన. ఇష్టదేవతారధన చేయండి.

మకరరాశి ఫలాలు : మంచి శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. శ్రీ లలితా దేవి స
హస్రనామాలను పారాయనం చేయండి.

కుంభరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ధైర్యంతో పనులు చేయాలి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి కొంచెం శ్రమించాల్సిన రోజు. విద్య, ఆర్థిక, ఉద్యోగ విషయాలలో కొంచెం ఆటంకాలు వస్తాయి. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు చేసే అన్ని రకాల పనులలో వేగం పెరుగుతుంది. కుటుంబాలలో చక్కటి సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. గతంలోపెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తుంది. మిత్రుల ద్వారా మంచి వార్తలు వింటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ శివ, లక్ష్మీ ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp