Zodiac Signs : జూన్ 08 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: June 8, 2022, 12:46 am

మేషరాశి ఫలాలు : అనుకున్న విధంగా అన్ని పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం. అన్ని రకాల వృత్తుల వారికి శుభదాయకమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలకు లాభాలు. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. సంతోషంగా ఉంటారు. కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలంగా ఉంటుంది. మహిళలకు ధనలాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు అనుకోని మార్పులు జరుగుతాయి. కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉండవు. అనుకోని ఖర్చులు వస్తాయి. వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మహిళలకు సాధారణ పరిస్థితి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
కర్కాటక రాశి ఫలాలు : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చక్కటి రోజు.చింతామణి గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope June 08 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 08 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. కొంచెం శ్రమించాల్సిన రోజు. అరోగ్య విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్తగా తీసుకోవాలి. కుటుంబంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సాయంత్రం నుంచి సానుకూల మార్పులు వస్తాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇష్టదేవతారాదన చేయండి.

తులారాశి ఫలాలు : అదాయం కోసం అన్వేషిస్తారు. అక్కచెల్లల ద్వారా శుభవార్తలను వింటారు. బంధవుల ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. కొత్త అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాలలో శుభకరంగా ఉంటాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూలమైన వార్తలు వింటారు. ఆదాయం తగ్గుతుంది. అప్పులు కోసం ప్రయత్నం చేస్తారు. ఆఫీస్‌లో పై అధికారుల ద్వారా వత్తిడులు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. మహిళలకు పని భారం. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం సుఖంతో ఈరోజు గడుస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆనవసర ఖర్చులు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న సమ్యలు వస్తాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మంచి ఆలోచనలు వస్తాయి. ముఖ్య నిర్ణయాలలో ధైర్యంగా తీసుకుంటారు. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. కుటుంబంలో సానుకూలమైన వాతావరణం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. ధన లాభాలు వస్తాయి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. మంచి వార్తలు వింటారు. ఉత్సాహంగా గడుపుతారు. నవగ్రహాల చుట్టు ప్రదక్షణలు చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన సమయం. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. ప్రయాణ సూచన. ఉద్యోగులకు కొంచెం కష్టమైన రోజు. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp