Zodiac Signs : జూన్  10 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: June 9, 2022, 11:00 pm

మేషరాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు అందుతాయి. అన్నిర కాలుగా బాగుంటుంది. శ్రీ లక్ష్మీ స్తోత్రంతో అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. అనవసర వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. విద్య, ఉద్యోగ విషయాలలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. శ్రీ లక్ష్మీ, లలితాదేవీ ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : మీరు చేసే అన్నిరకాల వ్యవహారాలలో లాభాలు గడిస్తారు. విజయం సాదిస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారి సలహాలు మీకు చాలా ఉపయోగపడుతాయి. దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార లాభాలు వస్తాయి. అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వర లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope June 10 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 10 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన సమయం. ఈరోజు అనుకోని విధంగా నష్టాలు వస్తాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. దూర ప్రయాణ సూచన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : మంచి రోజు. అనుకూలమైన వాతావరణం. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ప్రయాణ సూచన. వ్యాపారాలలో లాభాలు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం సుఖంగా ఉంటుంది. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ధన సంబంధ విషయాలలో సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో సాధారణ పరిస్థితి. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీ అష్టోతరంతో పూజ చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలతో కూడిన రోజు. మంచి సమయం ఇది. అనుకోని లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అనవసర ఖర్చుల నుంచి తప్పించుకోని ముందుకుపోతారు. వ్యాపారాలలో లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన సమయం. ఆర్థికంగా మందగమనం. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మీరు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. ధైర్యంతో ముందుకుపోవాలి. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.
అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. సంతానం వల్ల ప్రయోజనాలు వస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ప్రయాణ లాభం. వస్త్రలాభం. మహిళలకు శుభ వార్తలు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : అంతర్గత శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతారు. ఆనుకోని ఇబ్బందులు. పనులు పెండింగ్‌ పనులు అంతే ఉంటాయి. శారీరక శ్రమ. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షణలు చేయండి.

మీనరాశి ఫలాలు : మంచి శుభ సమయం. సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలలో లాభం. ఇంట్లో, బయటా అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మహిళలకు శుభకరమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp