Zodiac Signs : జూన్ 19 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : జూన్ 19 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : సంతోషంతో కూడిన రోజు. అన్ని రకాల పనులను త్వరితగతిన పూర్తిచేస్తారు. ఉత్సాహం, ఉల్లాసంగా గడుపుతారు. విద్య, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సూర్యారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థిక వ్యవహారాలు చికాకులు తెస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక సమస్యల బాధ పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. మిథున రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత విశ్రాంతి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 June 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : సంతోషంతో కూడిన రోజు. అన్ని రకాల పనులను త్వరితగతిన పూర్తిచేస్తారు. ఉత్సాహం, ఉల్లాసంగా గడుపుతారు. విద్య, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సూర్యారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థిక వ్యవహారాలు చికాకులు తెస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక సమస్యల బాధ పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత విశ్రాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. పేదలకు సహాయం, సమాజ సేవ కోసం సమయం వినియోగిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ పెద్దలతో కలసి సఖ్యతతో నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలకు అవకాశం. విహార యాత్రలకు ప్లాన్‌ చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలతతో ఉంటాయి. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

Today Horoscope June 19 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 19 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : కష్టపడాల్సిన రోజు. వివాదాలకు ఆస్కారం ఉంది. శ్రమతో కూడిన రోజు గడిపినా ఫలితం మాత్రం శూన్యం. ఆర్థిక మందగమనం. అనారోగ్య సూచన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : మంచి మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మనస్సు ప్రశాంతత లభిస్తుంది. అన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : ఇబ్బంది కరంగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల ద్వారా చికాకులు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. అప్పులు తీరుస్తారు. లాభాలు గడిస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అనారోగ్య సూచన. కుటుంబంలో చికాకులు వస్తాయి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అన్ని రకాల పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి రోజు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. ఉత్సాహంగా పని చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌లో లాభాలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ శివారాధన చేయండి.

మకరరాశి ఫలాలు : చాలా సంతోషంగా ఉంటారు. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. స్త్రీ మూలకంగా లాభాలు వస్తాయి. శ్రీ సూర్యారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఉత్సాహంగా పనిచేస్తారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. బందువుల శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : చాలా సంతోషంగా గడుపుతారు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య మూలకంగా ఖర్చులు చేస్తారు. అన్నదమ్ముల నుంచి లాభాలు గడిస్తారు. మిత్రలు ద్వారా శుభవార్త శ్రవణం. ఇష్టదేవతరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది