Zodiac Signs : జూన్ 23 గురువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. అతిథి రాకతో సందడి వాతావరణం. ఖర్చులు పెరుగుతాయి కానీ వాటిని అధిగమిస్తారు. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. విదేశీ ప్రయాత్నాలు అనుకూలిస్తాయి. కుటంబంలో కీలక నిర్ణయాలు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది.
మిథున రాశి ఫలాలు : ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలత. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటపుడు పెద్దల నిర్ణయాలు తీసుకోండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధన సంబంధ విషయాలలో అనుకూలత ఉంటుంది. మహిళలకు వస్త్రలాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనవసర వివాదాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు వింటారు. ఇంటా, బయటా శ్రమ పెరుగుతుంది. మహిళలకు నిరుత్సాహంగా ఉంటుంది.
సింహ రాశి ఫలాలు : ఇబ్బందులు పడుతారు. ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. అనవసర విషయాలలో తలదూర్చి ఇబ్బంది పడుతారు. దూరప్రయాణ సూచన. మిత్రలతో వివాదాలు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. అన్నదమ్ముల నుంచి వివాదాలకు అవకాశం. పాత మిత్రుల ద్వారా సహయ సహకారాలు అందుతాయి. విద్య, ఉద్యోగ అవకాశాలకు మంచిరోజు. ఇష్ఠదేవతారాధన చేయండి.
తులారాశి ఫలాలు : పెద్దల సహయం అందుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో మంచి గౌరవం అందుతుంది. కుటుంబ వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూల వాతావరణం. అమ్మ తరపు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. స్నేహితుల వల్ల సమస్యలు రావచ్చు జాగ్రత్త. పనులలో జాప్యం పెరుగుతుంది. దూరప్రాంతాల నుంచి చెడు వార్తలు వింటారు. ఆదాయం తగ్గుతుంది. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. అప్పులు తీరుస్తారు. మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా లబ్ది పొందుతారు. మీరు గతంలో పెట్టుబడి పెట్టినవి నేడు లాభాలు తెస్తాయి. అన్ని విషయాలో పురోగతి కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్య యోచన చేస్తారు. వివాహ సంబంధాలు కలసి వస్తాయి. ఇష్టదేవతారధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. మిత్రుల మాట సహాయంతో అన్ని పనులు అనుకూలం అవుతాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. చాలా కాలంగా ఉన్న పెండింగ్ పనలు పూర్తి చేస్తారు. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయండి.