Zodiac Signs : జూన్ 24 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 23, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరగుతుంది. ఆటల పాటల ద్వారా ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మిత్రల సహాయం తీసుకుంటారు. కొత్త పరిచయాలు అనుకూలిస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనకూలమైన రోజు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతారు. మంచి వార్తలు వింటారు. వాహనాలను కొనడానికి ప్రయత్నిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దూర ప్రాంతం నుంచి శుభవర్తాలు వింటారు. మహిలలకు లాభదాయకమైన రోజు. విష్ణు ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆదాయం పెరగుతుంది. చేసే పనులలో జాప్యం జరుగుతుంది. అమ్మ తరుపువారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope June 24 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 24 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకోని మార్గల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. చాలాకాలంగా వేచిచూస్తున్న శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : చాలా కాలంగా వేచి చూస్తున్న వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అక్కచెల్లల ద్వారా లాభాలు వస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. ఇష్టదేవతరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలు వస్తాయి. ధైర్యంతో ముందుకుపోతారు. తెలివితేటలతో పనులను పూర్తిచేయాల్సి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. క్షేత్రాల సందర్శనకు ప్లాన్‌ చేస్తారు. అన్ని రకాల వ్యాపారాలకు లాభాలు వస్తాయి. దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మాట సహాయం ద్వారా మీరు మంచి పేరు సంపాదిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు జరుగుతాయి. చెడు పనులకు, వ్యసనాలకు దూరంగా ఉంటారు. మహిళలకు శుభదాయకంగా ఉంటుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాల వృత్తి, వ్యాపారాలకు లాభం. ఇంట్లో ప్రశాంత వాతావరణం. సమాజంలో మంచి ప్రతిష్ఠలు. ఆదాయం పెరుగుతుంది. తల్లిదండ్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధనం పెరుగుతుంది. పాత బాకాయిలు వసూలు అవుతాయి. అప్పులు తీరుస్తారు. మిత్రుల ద్వారా మంచి వార్తలు వింటారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. అనవసర ఖర్చులు వస్తాయి. అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు. బంధువుల ద్వారా చెడువార్తలు వింటారు. చాలా కాలంగా వేచిచూసిన ఫలితాలలో నిరాశ మిగులుతుంది. అమ్మవారి దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అన్ని పనులలో ఆటంకాలు ఏర్పడుతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు పెరుగుతాయి. మాట పట్టింపుల వల్ల ఇబ్బంది. అనుకోని ఖర్చులు వస్తాయి. దూర ప్రయాణ సూచన, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు పని భారం పెరగుతుంది. శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp