Home » Devotional » Today Horoscope June 25 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూన్ 25 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 24, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : మంచి మంచి వార్తలు వింటారు. అనకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆలోచనలకు పదును పెడుతారు. మహిళలకు మంచిరోజు. శుభఫలితాల కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని నష్టాలు రావచ్చు. ఇబ్బందులు పడుతారు. కానీ ధైర్యంతో ముందుకు పోవడం ఈరోజు ప్రత్యేకం. ఆర్థికంగా మందగమనం. నిరాశతో ఈరోజు గడుస్తుంది. ప్రయాణలలో చికాకులు. శ్రీ రామ తారకాన్ని పారాయణం చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అమ్మమ్మ తరపు వారి నుంచి శుభవర్తాలు. ప్రేమికుల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చాలా కాలంగా వేచి చూస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పర్వాలేదు. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. అప్పులు తీర్చాలని ప్రయత్నిస్తారు. మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope June 25 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : అనుకోని అశుభ ఫలితాలు. దీర్ఘకాల వ్యాధుల ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా ఇబ్బంది. ప్రయానాల వల్ల చికాకులు. పాత బాకీలు వసూలు కావు. వివాదాలకు అవకాశం ఉంది. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. చేసే పనులలో వేగం తగ్గుతుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపరాలలో పెద్దగా లాభాలు రావు. విద్య, ఉద్యోగ విషయాలలో ప్రతికూలత ఉంటుంది. పనులు నత్తనడకన సాగుతాయి. శ్రీ విష్ణు సహస్రనానమాలను పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్య, వైద్యం, రియల్‌, మెడికల్‌ రంగాల వారికి లాభదాయకమైన రోజు. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్శర స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మీరు మంచి పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా చక్కటి రోజు. అన్నింటా జయం సాధిస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ హనుమాన్‌ దేవాలయ దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. అర్థికంగా ఇబ్బంది. అనవసర ఖర్చులు వస్తాయి. అనారోగ్య సూచన. వృత్తి వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు రావు. కుటుంబంలో చికాకులు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు. అమ్మవారి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : చాలా కాలంగా వేచి చూస్తున్న పనులు పూర్తిచేస్తారు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూల ఫలితాలు. మంచి పనులు ప్రారంభిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ధైర్యంతో ముందుకుపోతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అన్నింటా ప్రతికూల వాతావరణం. అన్ని పనులలో జాప్యం పెరుగుతుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. ఇంటా, బయటా పనిభారం పెరుగుతుంది. మాట పట్టింపుతో మనస్పు ప్రశాంతత కోల్పోతారు. నవగ్రహాలకు ప్రదక్షణలు, ఆంజనేయారాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి