Zodiac Signs : జూన్ 28 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 27 June 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అనుకోని అతిథి రాకతో ఇంట్లో సందడి. అప్పులు తీరుస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి వార్తలు వింటారు. మహిళలకు మంచి రోజు. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. తెలివితేటలను ఉపయోగిస్తారు. అందరికంటే ముందుకు పోవాలని ఆరాటపడుతారు. అన్నింటా జయం సాధిస్తారు. అర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఇష్టదేవతారధన చేయండి.

మిథున రాశి ఫలాలు : చెడు వార్త శ్రవణం. అప్పుల కోసం ప్రయత్నం, అన్నింటా చికాకులు. పనులలో జాప్యం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు రావచ్చు. మహిళలకు అనారోగ్య సూచన, ఆదాయం తగ్గుతుంది. శ్రీ మంగళ పార్వతీ ఆరాధన చేయండి. కర్కాటక రాశి పలాలు : పనులను వేగంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మిత్రులు, బంధువుల నుంచి ఆహ్వానాలు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దుర్గాదేవి ఆరాదన చేయండి.

Today Horoscope June 28 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 28 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : అన్నింటా శుభం జరుగుతాయి. ఆదాయ మార్గాల కోస ప్రయత్నిస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఇంటా, బయటా చక్కటి వాతావరణం. చక్కటి గౌరవ, మర్యాదలు లభిస్తాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది. చేసే పనులలో శ్రమంతా వృథా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో ఉమ్మడి పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిన రోజు. శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతారు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : అప్తుల నుంచి మంచి వార్తలు వింటారు. కుటుంబంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు కొనుగోలుకు ప్రయత్నిస్తారు. మంచి పనులు ప్రారంభిస్తారు. తప్పుల ను సరిదిద్దుకుంటారు. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా మీరు విజయం సాధిస్తారు. అనుకున్న దాని కంటే ఎక్కువ ఫలాన్ని పొందుతారు. విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో చక్కటి లాభాలు. అనుకోని వారి నుంచి లాభాలు పొందుతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలను పొందుతారు. ఆప్తుల నుంచి మంచి వార్తలు వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. ఆస్తి సంబంధ విషయాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది. అప్పులు చేస్తారు. బంధువుల నుంచి ఇబ్బందులు. అన్నదమ్ముల నుంచి మంచి సహయాన్ని అందిస్తారు. స్త్రీల వల్ల లాభాలు పొందుతారు. కానీ మాటపట్టింపులు వల్ల ఇబ్బంది పడుతారు. ఆర్థిక మందగమనం. శ్రీ మంగళ గౌరీ ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలుకు ప్రయత్నిస్తారు. శుభవార్తలు వింటారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అన్నింటా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు తొలిగిపోతాయి. మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. అమ్మనాన్నల ద్వారా మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  2. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  3. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  4. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  5. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  6. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  7. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి