Zodiac Signs : జూన్ 30 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :29 June 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు కొంత కష్టపడాల్సిన రోజు. కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. అనవసర విషయాలలో తలదూర్చి పరువు పోగొట్టుకోకండి. ఆలోచనలలో స్పష్టత కరువుతుంది. మీరు శ్రీలలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి మంచి జరుగుతుంది. వృషభరాశి ఫలాలు : అన్నింటా శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో సమస్యలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఆధైర్యం వీడి ముందుకుపోతారు. ధనం చేతినిండా ఉంటుంది. ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులు తీరుస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : పెద్దల ఆశీస్సులతో ఈరోజు సజావుగా నడుస్తుంది. ఆర్థిక అంశాలలో పురోగతి కనిపిస్తుంది. భవిష్యత్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలో అనుకూలం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. మీరు అనుకోని చెడు వార్తలు వినే అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకుపోవాల్సి వస్తుంది. అరోగ్యభగం. మహిళలకు దూర ప్రాంతం నుంచి వార్తలు అందుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి శుభం కలుగుతుంది.

Today Horoscope June 30 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 30 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం ఉండవచ్చు. గ్రహచలనాల రీత్యా ఇబ్బందులు రావచ్చు కానీ అధైర్యపడవద్దు. ఓపకి సహనంతో ముందుకు పోవాల్సిన రోజు. ఆర్థికంగా ఇబ్బంది. సమయానికి చెతికి ధనం అందదు. మిత్రులతో వివాదాలకు అవకాశం. చాలా కాలంగా ఉన్న సమస్యలు మరింత చికాకు పెడుతాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : మీరు అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయంలో పురోగతితో సంతోషం. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. మీరు చేసని శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మహిళలకు, వ్యాపారులకు లాభదాయకమైన రోజు. శ్రీ గణపతి పంచరత్న స్తోత్రం పారాయణం చేయండి.,

తులారాశి ఫలాలు : మంచి ఫలితాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. ఇంటా, బయటా మీరు ఆశించిన గౌరవ మర్యాదలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడుతారు. అప్పులు తీరుస్తారు. శ్రీ రామ తారకాన్ని జపించండి శుభఫలితాలు వస్తాయి.

వృశ్చికరాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంది. ధన సంబంధ విషయాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. ఇంట్లోకు అవసరమైన విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు శుభవార్తలు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనకూలమైన రోజు. విదేశీ విద్య ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. విద్య, ఉద్యోగ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : మీరు అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు అనుకూలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు. ఆఫీస్లో పై అధికారుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు శుభ సమయం. శ్రీ గురు దత్తాత్రేయారాధన చేయండి.,

కుంభరాశి ఫలాలు : మంచి, చెడుల మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్గకాలిక పెట్టుబడులకు మంచి సమయం కాదు. అనవసర విషయాల జోలికి పోకండి. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన రోజు. వ్యాపారాలలో చికాకులు వస్తాయి. ప్రయాణ సూచన. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అనుకున్న విధంగా మీరు పనులు పూర్తిచేయలేరు. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. అప్పులు చేస్తారు. ఇంట్లో సమస్యల నుంచి బయటపడుతారు. విదేశీ వ్యవహరాలలో అనుకూలత కనిపిస్తుంది. మహిళలకు శుభమైన రోజు. శ్రీ సుబ్రమణ్య భుజంగం పారాయణం చేయండి అనుకూల ఫలితాలు వస్తాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి