Home » Devotional » Today Horoscope March 07 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 07 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Updated on: March 7, 2022, 12:23 am
Advertisement

మేష రాశిఫలాలు : అనుకూలమైన రోజు. అత్యంత శుభఫలితాలను పొందుతారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడుతారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభాలు వస్తాయి. మహిళలకు ప్రోత్సాహరకరమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశిఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. ఆర్థిక విషయాలలో పెద్దల సలహాలు తీసుకోండి. ఆఫీస్‌లో శ్రద్ధతో పనిచేయండి. వివాదాలకు దూరంగా ఉండండి. వాహనాలను జాగ్రత్తగా నడుపాల్సిన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

మిధున రాశిఫలాలు : ఆనందం మీ సొంతం. అర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకమైన రోజు, విద్యార్థులు శ్రమించి మంచి ఫలితాలు పొందుతారు. మహిళలకు బంధవుల నుంచి శుభవార్తాలు. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంచెం శుభం, కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కనిపిస్తుంది. ధైర్యంతో ముందుకు వెళితేనే ఫలితం వస్తుంది. అప్పుల బాధలు. వివాదాల వల్ల మానసిక చికాకులు. మహిళలకు అనారోగ్యం. శ్రీ శివాభిషేకం చేయండి.

Today Horoscope march 07 2022 check your Zodiac signs

Advertisement

సింహ రాశి ఫలాలు : మీ తెలివి తేటలకు ఈ రోజు గుర్తింపు లభిస్తుంది. ఆభివృద్ధి మార్గంలో పయనిస్తారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోష వాతావరణం. మహిలలకు ప్రయోజనాలు చేకూరే రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల ద్వారా ప్రయోజనం పొందుతారు. శుభవార్తలు వింటారు. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నం చేయడానికి అనుకూలం. అప్పులు ఎవరికి ఇవ్వకండి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

Advertisement

తులా రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలను పొందుతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మిత్రుల ద్వారా శుభవార్తాలు వింటారు. మహిళలకు ధనలాభ సూచన. ఆర్థికంగా మంచి రోజు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : శుభకరమైన రోజు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబంలో సానుకూల మార్పులు. ఉద్యోగులకు అనుకూలమైనరోజు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. మహిళలకు ధనలాభ సూచన. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : ప్రేమికులకు మంచి రోజు. విద్యార్థులు, ఉద్యోగులకు శుభ ఫలితాలు. ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో మంచి మార్పులు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సూచన. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశిఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన రోజు. ఆర్థికంగా పురోగతి. వ్యాపార వర్గాల వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు పుట్టింటి వారి నుంచి శుభ వార్తలు. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశిఫలాలు : ధన సంబంధ విషయాలలో జాగ్రత్తలు. అనవసర ఖర్చులు వస్తాయి జాగ్రత్త. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్త. తెలివి తేటలకు పదును పెట్టండి. గుడ్డిగా ఎవరిని ఈరోజు నమ్మవద్దు. మహిళలకు శ్రమభారం పెరుగుతుంది. శివుడికి అభిషేకం చేయించండి.

మీన రాశి ఫలాలు : అనందంగా గడుపుతారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు. విద్యార్థులు, శ్రామికులకు చక్కటి రోజు. మహిలలకు శుభ వార్తలు. ఇష్టదేవతరాధన చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి