Zodiac Signs : మార్చి 09 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 8, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మంచి రోజు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు సంతోషం, లాభాలు. శ్రీ దుర్గా ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీ పనులు వాయిదా పడుతాయి. ఆకస్మిక నష్టాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది. అనారోగ్య సమస్యలు. కాలభైరావాష్టకం చదవండి.

మిథునరాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో ముఖ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ధన లాభాలు వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఆభివృద్ది కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. శుభఫలితాలను సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలం. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope march 09 2022 check your zodiac signs

Today Horoscope march 09 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పని భారం పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు దీనివల్ల చికాకులు. మిత్రుల ద్వారా సహకారం అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్యరాశి ఫలాలు : అనారోగ్య సమస్యలు. అప్పులు కోసం ప్రయత్నం. వ్యాపారాలు మందగమనం. కుటుంబంలో స్వల్ప వాగ్వాదాలు. శ్రమ భారం పెరుగుతుంది. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. బాకీలు వసూలవుతాయి. దేవాలయ సందర్శన. వివాదాల నుంచి విముక్తి. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆర్థిక మందగమనం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : అనుకోని నష్టాలు. ప్రతి విషయంలోనూ చికాకులు, ప్రయాణాల వల్ల ఇబ్బందులు. పనులలో జాప్యం. కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది. మహిళలకు అనారోగ్య సూచన. కాలభైరావాష్టకం చదవండి.

మకరరాశి ఫలాలు : కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మహిళలకు పనిభారం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : శుభకరమైన రోజు. ఆర్థికంగా సంతోషకరంగా ఉంటుంది. ముఖ్య వార్తలు వింటారు. మిత్రుల నుంచి ప్రయోజనాలు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా ఇబ్బంది. అప్పులు చేస్తారు. ప్రయాణాలలో చికాకులు. విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబంలో మార్పులు. వివాదాలు ఆస్కారం. సాయంత్రం నుంచి కొంత మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ శివారాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp