Zodiac Signs : మార్చి 10 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 March 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు శ్రమించిన దానికి ఫలితం దక్కుతుంది. అప్పులు తీరుస్తారు. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబానికి సంబంధించి శుభవార్త వింటారు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వాతావరణం ఉంటుంది. అనుకూలమైన ఫలితాలతో సంతోషం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా వెసులు బాటు ఉంటుంది. మహిళలకు వస్త్రలాభాలు. దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు ఫలితాలు వస్తాయి, అప్పులు తీరుస్తారు. వ్యాపార లావాదేవీలు మందగమనంగా నడుస్తాయి. వాదనలకు దూరంగా ఉండండి. ప్రయాణాల వల్ల చికాకులు. మహిళలకు విశ్రాంతి దొరకదు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పనులు ప్రారంభించకండి. ఆర్థికంగా ఇబ్బంది. వ్యాపారాలు సాఫీగా సాగవు. ప్రశాంతత కోల్పోతారు. కుటుంబంలో ఇబ్బందులు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

Today Horoscope march 10 2022 check your zodiac signs

Today Horoscope march 10 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. ధనలాభాలు వస్తాయి, కుటుంబంలో చికాకులను పరిష్కరించుకుంటారు. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు రావచ్చు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : చక్కటి శుభదినం. పనులను వేగంగా పూర్తిచేస్తారు. అందరితో సమన్వయం చేసుకుని ముందుకుపోతారు. మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యా, ఉద్యోగ సంబంధ శుభవార్తలు వింటారు. శ్రీ దత్త కవచం చదువుకోండి.

తులారాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్థిక మందగమనం. అనవస వివాదాలకు పోకండి. కుటుంబంలో మనస్పర్థలు. శుభ కార్య ప్రయత్నాలకు ఆటంకాలు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ సాయిబాబా/గురు రాఘవేంద్ర ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి అడుగు వేస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. బంధువుల నుంచి లాభాలు అదుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : అన్ని విషయాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ధన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఆటంకాలు. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల నుంచి సలహాలు తీసుకోండి. మహిళలకు మామూలుగా ఉంటుంది.
నవగ్రహారాధన చేయండి.

మకరరాశి ఫలాలు : చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. మంచి వార్తలు వింటారు. ధన సంబంధ విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి. స్త్రీలు పురుషుల ద్వారా, పురుషులు స్త్రీల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అన్ని రంగా ల వారికి మంచిరోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు ; ప్రతికూలమైన రోజు. అనవసరంగా ఖర్చులు చేయకండి. ప్రతి ఒక్కరితో వినయంగా, సఖ్యతతో మెలగండి. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శత్రు బాధ పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ధైర్యంతో ముందుకుపోతారు. అన్నింటా విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం. అనందంగా గడుపుతారు. మహిళలకు స్వర్ణలాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు మంచి ఫలితాలు వస్తాయి. ఊహించని చోట నుంచి శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి