Zodiac Signs : మార్చి 22 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. అనుకోని ధనలాభాలు వస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మనోల్లాసంతో చక్కగా గడుపుతారు. మహిళలకు శుభం. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. సకాలంలో అన్ని సమకూరుతాయి. మంచి వార్తలు వింటారు,. దేవాలయాల దర్శనం, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థితి కలుగుతుంది, ఆప్పులు తీరుస్తారు. ఆనందంగా ముందుకు పోతారు. కుటుంబంలో శుభకార్య యోచన. అన్నింటా జయం. కనకదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. శారీరక బడలికతో ఇబ్బంది పడుతారు. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టకండి. తల్లి తరుపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. లలితా సహస్రనామాలను పారాయణం చేయండి.

Today Horoscope march 22 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : సకల వృత్తుల వారికి శుభ ఫలితాలు. అన్నింటా జయం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం, ఖర్చులు పెరగడం జరుగుతాయి. ప్రయాణాల వల్ల అలసట. మహిలలకు పని భారం. నవగ్రహాలకు ప్రదక్షణలు, స్తోత్రం చదవడం మంచి ఫలితాన్నిస్తుంది.

తులారాశి ఫలాలు : కొంచెం శ్రమతో కూడిన రోజు,. ధైర్యంతో ముందుకుపోవాలి. అనుకోని నష్టాలు రావచ్చు. ధన లాభాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టే వారు కొంచెం ఆలోచించండి. మహిళలకు అనవసర వివాదాలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అత్తమామల నుంచి సహాయం అందుతుంది. అందరినీ కలుపుకొని పోతారు. గోసేవ చేయండి మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి ఫలాలు : దూర బంధువుల రాకతో సంతోషం. శుభవార్తలు అందడంతో ఆనందం. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మహిలలకు వస్త్రలాభాలు. అనుకున్నదాని కంటే ఎక్కువ లాభాలతో ఉత్సాహంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అందరి మన్ననలు పొందుతారు. శుభకరమైన ఫలితాలతో సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా చక్కటి లాభాలు వస్తాయి. అన్నదమ్ముల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఈరోజు గడుస్తుంది. ఏ పని చేసినా ఈరోజు కొంచెం జాగ్రత్తగా చేయండి. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త. ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. మహిళలకు అనారోగ్య సమస్య రావచ్చు. అమ్మవారి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : మీరు చేసే పనులు నెమ్మదిగా సాగుతాయి. ఉల్లాసంగా ఉంటారు. గత పెట్టుబడులు లాభాలను తెస్తాయి. మంచి మిత్రుల పరిచయం కలుగుతుంది. కుటుంబంలో మార్పులు మీకు మంచి చేస్తాయి. ఆంజనేయారాధన చేయండి.

Recent Posts

Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం

Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…

2 hours ago

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

5 hours ago

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

6 hours ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

8 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

9 hours ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

10 hours ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

11 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

12 hours ago