Home » Devotional » Today Horoscope March 24 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 24 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 23, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. చికాకులు. అనారోగ్య సూచన. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు చికాకులు. శ్రీ రామ రక్షా స్తోత్రంప పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : మంచి ఫలితాలతో ముందుకుపోతారు. ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహాయం అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు చక్కటి శుభ ఫలితాలు. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : అన్నింటా విజయం. పనులు సాఫీగా పూర్తిచేస్తారు. కుటుంబంలో మంచి మార్పులు, ఆకస్మిక లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. మహిళలకు ఆర్థికంగా మంచి రోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
కర్కాటక రాశి ఫలాలు : కొంచెం అనుకూలం, మరికొంత వ్యతిరేక ఫలితాలు వస్తాయి. చేసే పనులలో జాప్యం. కుటుంబంలో అనవసర వివాదాలు. అనారోగ్య సూచన జాగ్రత్త. మహిళలకు చికాకులు. వస్త్ర, వస్తు లాభాలు. గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి.

Today Horoscope march 24 2022 check your zodiac signs

Advertisement

సింహ రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలతో ఇబ్బంది. అనుకోని ఖర్చులు. మనస్సు స్థిరంగా ఉండదు. చేసే పనులలో ఇబ్బందులు. పెద్దల నుంచి సహయం అందదు. అన్ని రంగాలు, వ్యాపారాలకు ఇబ్బంది ఉండే రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కన్యా రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ప్రతి పనిలోనూ మీక జయం కలిగే అవకాశం కనిపిస్తుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో మంచి మార్పులు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మంచి చేద్దామని ప్రయత్నించినా చెడుగా భావిస్తారు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి. ఆర్థికంగా మంచి పురోగతి. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. ప్రయాణం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. కార్యజయం. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలం. ఇష్టదేవతారాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీకు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు. ప్రయాణాలు చేసి చికాకు పడుతారు. పని భారం పెరుగుతుంది. అప్పులు చేస్తారు. మహిళలకు చికాకులు. ‘ఓం నమో భగవతే వాసుదేవాయనమః’ అనే నామాన్ని కనీసం 108 సార్లు రెండుపూటల జపించండి.

మకర రాశి ఫలాలు : అనుకూలమైన రోజు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలకు ప్రయత్నాలు చేస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. పెద్దల ద్వారా సహయం పొందుతారు. అర్థిక విషయాలు మంచిగా సాగుతాయి. వ్యాపారులకు లాభాలు. శ్రీ లక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : మీరు చేసే పనులు చక్కగా పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా, బయటా చక్కటి ఫలితాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : నిదానంగా ఈరోజు గడుస్తుంది. ప్రతికూల ఫలితాలను మీ ధైర్యం, తెలివి తేటలతో అనుకూలం చేసుకుంటారు. అనుకోని ఖర్చులు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. మహిళలకు పని బారం. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి