Home » Devotional » Today Horoscope March 29 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 29 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 28, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు పనులు వేగంగా పూర్తిచేస్తారు. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. కుటుంబంలో మంచి మార్పులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందుల మధ్య ఈరోజు మందుకు వెళ్తారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. కుటుబంలో విభేదాలు వస్తాయి,. అనారోగ్య సూచన. శ్రీ దుర్గాదేవిని పసుపు,కుంకుమలతో ఆరాధించండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : కుటంబంలో చిన్నచిన్న వాగ్వాదాలు జరుగుతాయి. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయానాల వల్ల చికాకులు కలుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో చికాకులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఆప్పులు తీరుస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో శుభ కార్య ప్రయత్నాలు. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope march 29 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా చక్కటి రోజు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : మీకు కొంచెం ప్రతికూల వాతావరణం. అప్పుల బాధలు పెరుగుతాయి. అనుకోని చోట నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ సుబ్రమణ్య స్వామి భుజంగం చదువుకోండి లేదా వినండి.

Advertisement

తులారాశి ఫలాలు : మీకు కుటుంబంలో అనుకోని ఇబ్బందులు. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టం. తీవ్రమైన పని వత్తిడి. పనులలో జాప్యం. ఆర్థిక మందగమనం. నవగ్రహాలకు ప్రదక్షణలు, స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్య పనులు వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. అన్ని రంగాల వారికి శుభదినం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అనుకోని ధన వ్యయం. అప్పుల కోసం ప్రయత్నం. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. పిల్లల వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సూచన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : శుభ సమయం ఈరోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. పాత బాకీలు వసూలు. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో ఇబ్బందులు. పనులు చేయలేక నిరుత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా మందగమనం. అప్పుల కోసం ప్రయత్నం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు అనారోగ్య సూచన. దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మీరు అనుకున్న దాని కంటే మెరుగ్గా రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి