Zodiac Signs : మే 12 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :11 May 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు గడిస్తారు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు. ఇంట్లో శుభ కార్యం చేయాలని భావిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది కానీ ధైర్యంతో దాన్ని అధిగమిస్తారు. కుటుంబంలో సంతోషం. ఆర్థిక మందగమనం. అప్పుల కోసం ప్రయత్నం. వివాహాది శుభకార్యల కోసం ప్రయత్నం. మహిళల ద్వారా లాభాలు. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే తారక మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మిధునరాశి ఫలాలు : మీతో ఉన్నవారు మీకు అన్యాయం చేస్తారు జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మకూడని రోజు. పెద్దలు, అన్నదమ్ముల నుంచి సహాయం అందుంతుంది. మహిళలకు శుభవార్తలు. అర్థికంగా పర్వాలేదు. శ్రీ లక్ష్మీ దేవి స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు అన్ని పనులను పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణ లాభాలు. వస్తులాభాలు. శ్రీ గురు ఆరాధన చేయండి.

Today Horoscope may 12 2022 check your zodiac signs

Today Horoscope may 12 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : మీరు మంచి వార్తలు వింటారు. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. శుభకార్యములకు హాజరవుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సమాజంలో మీకు మంచి గౌరవం.శ్రీ విష్ణు సహస్రనామాలను పారయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : చేసే అన్ని పనులలో జాప్యం పెరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. అప్పుల కోసం బ్యాంకులలో ప్రయత్నిస్తారు. రియల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలం కాదు. మహిళలకు శుభ వార్తలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీరు ఇష్టపడే వారి నుంచి వార్తలు అందుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ధనం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అన్ని సమస్యలు పరిస్కారం అవుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంఆయి. మహిళలకు లాభాలు. ఈరోజు మంచి పలితాల కోసం శ్రీ కృష్ణ ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మీరు చేసే అన్నింటా విజయం సాధిస్తారు, సంతోషం, లాభాలతో కూడిన రోజు, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. వ్యాపారాలలో లాభం వస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో మంచి గౌరవం. అభివృద్ధి సాధిస్తారు. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. అనుకోని నష్టాలు వస్తాయి. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతారు. వ్యాపారాలలో సాధారణ లాభాలు వస్తాయి. కుటుంబంలో వివాదాలు వస్తాయి. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి.

మకరరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో మంచి వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. ప్రయాణ సూచనలు. విందులకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : మీరు చేస్తున్న పనులు అనుకూలంగా ఉంటాయి. అప్పుల కోసం ప్రయత్నం. విలువైన వస్తువులు, ఆభరణాలు కొంటారు. మహిళలకు లాభాలు. పెద్దల ద్వారా లాభాలు పొందుతారు. చెడు వ్యసనాల నుంచి బయటపడుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. వాహనాలను నడిపించేటపుడు జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చులు చేస్తారు. వ్యాపారాలలో పెద్దగా లాభాలు కనిపించడం లేదు. మహిళలకు పని భారం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి