Home » Devotional » Today Horoscope May 21 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మే 21 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 20, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అనుకోని లాభాలు సాధిస్తారు. ఇంటా, బయటా మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. అర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మంచి ఆహారం, విహారం. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆటంకాలతో ఇబ్బందులు పడుతారు. పనులలో జాప్యం జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలతో సవాసం చేస్తారు. ఇష్టమైన వారి నుంచి చెడువార్తలు వింటారు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : అనుకోని శుభవార్తలు వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి శుభకరమైన రోజు. కొత్త అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా రాని బకాయిలు వసూలు అవుతాయి. అప్పులు తీరుస్తారు. మంచి రోజు. శ్రీం లక్ష్మీయైనమః అనే మంత్రాన్ని కనీసం 108సార్లు జపించండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు తొలిగిపోతాయి. కుటుంబంలో సంతోషం. అర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. దూర ప్రయాణ సూచన. విదేశీ వ్యవహారాలు కలసివస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope May 21 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అన్ని రకాలుగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం. చాలా కాలంగా వేచి చూస్తున్న పనులు పూర్తి. మిత్రుల కలయికతో ఆనందం పెరుగుతుంది. విలువలైన వస్తువులు కొంటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి,

కన్యారాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. దూరపు ప్రాంతాల నుంచి చెడు వార్తలు వినాల్సి రావచ్చు. బంధువుల నుంచి వత్తిడులు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. అప్పులు ఇవ్వద్దు, తీసుకోవద్దు. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మంచి చేద్దామనుకున్నా చెడుగా అవుతుంది. మిత్రుల ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతారు. అనవసర విషయాలతో చికాకులు. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ విష్ణు దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మీరు ఊహించని విధంగా లాభాలతో ఈరోజు గడుస్తుంది. కొంచెం పనికి కూడా అమితమైన లాభం. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మంచి ఆలోచనలు చేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీరు చేసే కార్యాలు నిదానంగానైనా పూర్తిచేస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్య యోచన. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. విద్యా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : కొంచెం శుభం, కొంచెం అశుభ సమయం ఇది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉండవు. కార్యాలయాలలో పని వత్తిడి. అనవసర వివాదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. విలువైన వస్తువలు కొంటారు. మంచి వార్తలు వింటారు. పనులలో జాప్యం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. వ్యాపారాలలో సాధారణ లాభాలు. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి,

మీనరాశి ఫలాలు : వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. సమాజంలో మంచి పేరు, గౌరవం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు పాజిటివ్గా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి.,

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి