Zodiac Signs : మే 23 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : మే 23 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ప్రయాణ చికాకులు పెరుగుతాయి. అనుకోని వివాదాలు రావచ్చు. మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. అన్ని విషయాలలో ప్రగతి కనిపిస్తుంది. శుభకరమైన రోజు. శ్రీ కుబేర, లక్ష్మీదేవి ఆరాధన చేయండి. మిథునరాశి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 May 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ప్రయాణ చికాకులు పెరుగుతాయి. అనుకోని వివాదాలు రావచ్చు. మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. అన్ని విషయాలలో ప్రగతి కనిపిస్తుంది. శుభకరమైన రోజు. శ్రీ కుబేర, లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు. ధైర్యంతో ముందుకుపోతారు. మంచి కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచిరోజు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. భవిష్యత్‌ ఆలోచనలు చేస్తారు. మిత్రుల ద్వారా మంచి వార్తలు వింటారు. శ్రీ శివాభిషేకం చేయండి.

Today Horoscope May 23 2022 Check Your Zodiac Signs

Today Horoscope May 23 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : అనుకోని శుభవార్తలు వింటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం. మీరు చేసే చక్కటి విషయాలను తెలుసుకుంటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని వృత్తుల వారికి శుభదాయకమైన రోజు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. శ్రీ శివకవచం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అన్ని రకాల వ్యవహరాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న బాధలు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అన్ని రకాల పనులు వేగంగా పూర్తిచేస్తారు. అదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు లాభాలను తెస్తాయి. శివపార్వతీ ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని నష్టాలు వస్తాయి. కార్యాలయంలో మీకు ఇబ్బందులు రావచ్చు. మహిళలకు పని భారం. శ్రీ లక్ష్మీపార్వతీ, సరస్వతి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకోని చెడు వార్తలు వింటారు. చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ప్రయాణ సూచన. మీరు చేసే పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మాత్రం సాదారణంగా ఉంటుంది. మిత్రుల ద్వారా మీ పనులు పూర్తిచేసుకుంటారు. శివాలయంలో ప్రదక్షణలు చేస్తారు.

కుంభరాశి ఫలాలు : శుభకరమైన ఈరోజు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వార్తలు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా లాబాల బాటలో నడుస్తాయి. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన సమయం ఇది. దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. మనస్సు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు పడుతారు. మహిళలకు చికాకులు. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది