Zodiac Signs : మే 24 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: May 23, 2022, 11:04 pm

మేషరాశి ఫలాలు : మంచి సమయం ఇది. అనుకున్న పనులు ముందుకుసాగుతాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మంచి రోజు. కొత్త వారితో పరిచయాలు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : చాలాకాలంగా వేచి చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి రోజు. ధనలాభాలు వస్తాయి. ఆమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు. సమాజంలో మంచి పేరు వస్తుంది. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయనం చేయండి.,

మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ధైర్యం కోల్పోతారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆదాయం తగ్గుతుంది. దూరప్రాంతం నుంచి చెడువార్తలు వింటారు. నవగ్రహాలకు ప్రదక్షణ, ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు అనుకున్న దాని కంటే ఎక్కువగా పనులు పూర్తి చేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. బాగా కష్టపడి పనిచేసి పై అధికారులు లేదా పెద్దల ద్వారా ప్రశంసలు పొందుతారు. విద్య, ఉద్యోగ విషయాలు అనకూలం. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

Today Horoscope May 24 2022 Check Your Zodiac Signs

Today Horoscope May 24 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్య యోచన. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్తిక లావాదేవీలలో లాభాలు గడిస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : కష్టపడాల్సిన రోజు. తప్పులను చేస్తారు. కానీ తర్వాత మీరు ఆ తప్పులను సరిదిద్దుకుంటారు. ధైర్యంతో పనులు చేస్తారు. శ్రమకు తగ్గ పలితం రాదు. నిరాశగా ఈరోజు గడుస్తుంది. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : మంచి రోజు. కుటుంబంలో చక్కటి వాతావరణం. స్థిరమైన ఆలోచనలు చేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ధైర్య సహసాలతో ముందుకుపోతారు. మహిళలకు మంచి వార్తలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం నష్టంతో ఈరోజు గడుస్తుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుకున పనులు వాయిదా పడుతారు. చెడు వార్తలు వింటారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చెడు వార్త శ్రవణం. బంధువుల నుంచి ఇబ్బందులు. కార్యాలయంలో పని వత్తిడి పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. రుణ ప్రయత్నం చేస్తారు. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి పూజ చేయండి.

మకర రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది.శుభకార్యాలకు హాజరవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అస్తి వివాదాలు పరిష్కారం. సకల వృత్తుల వారికి మంచి రోజు. శ్రీ కుజ, మంగళ గౌరీ ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు కాదు. అనవసర వివాదాలకు అస్కారం. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ధనలాభాలు వస్తాయి. వ్యాపారాలలో సాదారణ పరిస్థితులు. శ్రీ ఆంజనేయస్వామి దండకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అన్ని రకాల పనులు వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభకార్యం. అక్కచెల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మిత్రుల ద్వారా లాభాలు. మహిళలకు ధనలాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp