Zodiac Signs : మే 30 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : మే 30 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :29 May 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : శుభఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం. అరోగ్యం బాగుంటుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అనకూలమైన రోజు. ఆర్థికంగా బాగుంటుంది. మహిళలకు ఆనందకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ముఖ్యమైన వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : చేసే పనులలోజాప్యం జరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం లభించదు. అనవసర వివాదాలకు ఆస్కారం ఉంది. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటా, బయటా అనుకోని ఒత్తిడి. శ్రీశివాభిషేకం చేయించండి. కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ సంతృప్తి ఉండదు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణ సూచన. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. మహిళలు ఇబ్బందులు. శివమానస పూజ, ఆదిత్య హృదయ పారాయణం చేయండి.

Today Horoscope May 30 2022 Check Your Zodiac Signs

Today Horoscope May 30 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : శుభకార్య యోచన చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం. ప్రశాంత వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. మిత్రుల ద్వారా లాభాలు గడిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. శ్రీసోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. చేసిన పనికి తగ్గ ఫలితం రాదు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో సమస్యలు. పెట్టుబడులకు సరైన రోజు కాదు. మహిళలకు సంతోషకరకమైన రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మిత్రుల ద్వారా శుభవార్తలు. అనుకోని. లాభాలు. మహిళలకు శుభదినం. శ్రీకుబేర లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఆదాయమార్గాల పెరుగుతాయి. కుటుంబంలో చక్కటి శుభవాతావరణం. అనుకోని ఖర్చులు. పాత ఆస్తి వివాదాలు తీరుతాయి. అక్కచెల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అన్నింటా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. క్షేత్ర పందర్శన చేస్తారు. శ్రీ శివార్చన చేయండి.

మకరరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆనుకోని ఖర్చులు పెరుగుతాయి. బంధవుల ద్వారా చెడు వార్తలు. మిత్రుల కలయిక. మనసు ప్రశాంతత కోల్పోతారు. శ్రీలక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : శుభదినం. అన్నింటా జయం. అప్పులు తీరుస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. మంచి గౌరవం, ఆదాయం లభిస్తాయి. మహిళలకు చక్కటి లాభదాయకమైన రోజు. శ్రీ రుద్రార్చన చేయండి..

మీనరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. ఉద్యోగార్థులకు కష్టపడాల్సిన రోజు. విద్య, వ్యాపార విషయాలలో సాధారణంగా ఉంటుంది. అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. ప్రయాణలు చేసేటపుపడు జాగ్రత్త. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ రుద్రాభిషేకం మంచి పలితాన్నిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది