Zodiac Signs : నవంబర్ 24 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : నవంబర్ 24 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

మేష రాశి ఫలాలు : అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు. ఖర్చులు వస్తాయి. ఆదాయం అనుకున్నంత ఉండదు. ఆఫీస్‌లో, ఇంట్లో మీకు అంత అనుకూలత ఉండదు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలకు అవకాశం ఉంది. మహిళలకు పనిభారం. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టల పెరుగును . చేసే పనులు సకాలంలో పూర్తి . వ్యాపారంలో ధన లాభం. శుభకార్యాలలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 November 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు. ఖర్చులు వస్తాయి. ఆదాయం అనుకున్నంత ఉండదు. ఆఫీస్‌లో, ఇంట్లో మీకు అంత అనుకూలత ఉండదు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలకు అవకాశం ఉంది. మహిళలకు పనిభారం. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టల పెరుగును . చేసే పనులు సకాలంలో పూర్తి . వ్యాపారంలో ధన లాభం. శుభకార్యాలలో పాల్గొంటారు . పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ గురు ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభకార్య యోచన చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంతోషంగా గడుపుతారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మంచి రోజు. అన్ని రకాల వృత్తుల వారికి శుభదినం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీ తెలివితేటలకు పని చెప్పాల్సిన రోజు.ఆదాయంలో తగ్గుదల, అనవసర ఖర్చులు రావచ్చు. ఈరోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేసే పనులలో ఇబ్బందులు. ఆఫీస్‌లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope November 24 2022 Check Your Zodiac Signs

Today Horoscope November 24 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు మీరు శుభవార్తలు వింటారు. ఇంట్లో, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఆఫీస్‌లో మీకు మంచి గౌరవం లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. ప్రయాణాలు లాభిస్తాయి. నవగ్రహారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కష్టంతో కూడిన రోజు. ఆదాయంలో మార్పులు వస్తాయి. వ్యాపారాలలో నిదానంగా లాభాలు గడిస్తారు. కొద్దిగా శ్రమ పెరుగుతుంది. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నిచిన్న సమస్యలు రావచ్చు. ప్రయాణ చికాకులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఓపికతో మసులుకోవాల్సిన రోజు. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. కుటుంబంలో ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . మిత్రులతో మాట పట్టింపులు. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . వ్యాపారాలలో ధన నష్టం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. కళాకారులకు మంచి రోజు. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : కొత్త విషయాలు తెలుస్తాయి. ఆదాయంలోస్వల్ప వృద్ది. అనుకోని పనులు మీ మీద పడుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సమస్యలు. వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. మిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు.. శ్రీ శివాభిషేకం, దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకర రాశి ఫలాలు : చక్కటి శుభదినం. అనుకోని లాభాలు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. ఆఫీస్‌లో ఉత్సాహంగా పని చేస్తారు. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు. ప్రయానాల వల్ల మీకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా వివాదాలతో కూడిన రోజు జాగ్రత్త. ఆర్థికంగా అనుకున్నంతగా ఉండదు. విద్యా, ఉపాధి విషయాలలో చికాకులు పెరుగుతాయి. విందులు, వినోదాలతో సమయం, ధనం వృథా చేస్తారు. వ్యాపారాలలో పెద్ద మార్పులు ఉండవు. మహిళలకు పనివత్తిడి. శ్రీ దత్త కవచం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా శుభం, కొద్దిగా చెడుతో కూడిన రోజు. ఆదాయంలో వృద్ధి. అనుకోని ఖర్చులు. వ్యాపారాల్లో నష్టాలు. ప్రయాణ చికాకులు. ధైర్యంతో పనులు చేస్తేనే విజయం. శ్రమతో కూడిన రోజు. అనవసర వివాదాలు. మహిళలకు చికాకలు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది