Zodiac Signs : నవంబర్ 29 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

మేష రాశి ఫలాలు : కుటుంబంలో ఒక మంచివార్త వింటారు. వ్యాపారాలలో చక్కటి లాభాలు. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న మార్పులు మీ విశ్వాసాన్ని పెంచుతాయి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా జీవిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు పెద్దలు, లేదా మిత్రుల సహాయసహకారాలు అందుతాయి. ఆదాయంలోచక్కటి పెరుగుదల కనిపిస్తుంది. ఈరోజు ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు రావచ్చు. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. ప్రయాణ నష్టాలు. శ్రీ కుజగ్రహారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు అనుకోని అతిథి మీ ఇంటికి వస్తారు. ఆదాయంలో వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. మహిళలక మంచి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. ఆర్థికంగా అంతంతమాత్రం ఉంటుంది.కానీ మిత్రుల సహకారంతో అవసరాలను గట్టెక్కుతారు. వృథా ఖర్చులు పెడుతారు. ఆఫీస్లో మీరు అప్ సెట్ అవుతారు. మీ తెలివితేటలను ఉపయోగించాల్సినరోజు. అనుకోని వ్యవహారాలతో మీరు సతమతమవుతారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.

Today Horoscope November 29 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆహార, విహార నియమాలను పాటించండి. కొత్త ఆలోచనలకు పదును పెట్టాల్సిన రోజు. ధనాన్ని అనవసరంగా ఖర్చులు చేయవద్దు. పొదుపును ఈరోజు నుంచి ప్రారంభించండి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు వస్తాయి. కానీ పెద్దల సహకారంతో వాటిని అధిగమిస్తారు. మిత్రులతో విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆర్థికంగా పర్వాలేదు. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : కొద్దిగా అనారోగ్య సూచన కనిపిస్తుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. అనుకోని ఖర్చులు, అవసరాలకు మాత్రం ధనం చేతికి అందుతుంది. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. విద్యా, ఉపాధి విషయాలు సాధారణం. అన్నదమ్ముల నుంచి వత్తిడులు వస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

తులా రాశి ఫలాలు : దైర్యంతో పనిచేయండి విజయం మీ సొంతం ఈరోజు. ఆర్థికంగా చక్కటి రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు. ఆశాజనకమైన రోజు. అన్ని విషయాలలో సానుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రయాణ లాభాలు. మహిళలు మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆనుకోని ఖర్చులు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఆదాయంలో వృద్ది. వ్యాపారాలలో జాయింట్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ప్రయాణ సూచన. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాల్ని రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల ద్వారా అనుకోని ఇబ్బందులు. కుటుంబంలో సమస్యలను ఈరోజు మీరు అధిగమించగలరు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయనం చేయండి.

మకరరాశి ఫలాలు : కొద్దిగా శ్రమిస్తే విజయం మీ సొంతం. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలలో లాభాలు. అనుకోని చోట నుంచి లాభాలు గడిస్తారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణ సూచన, ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో చక్కటి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మీరు ఈరోజు ధైర్యంతో ముందుకుపోతారు. ఈరోజు పమీరు విశ్వాసంతో ముందుకుపోతారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. పెద్దల ద్వారా ఆర్థిక లాభాలు. పెట్టుబడులకు అనుకూలం. ప్రయాణ లాభాలు. మహిళలకు ధనలాభాలు. గోసేవ చేయండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా మధ్యస్తంగా ఉంటుంది. ఆర్థికంగా చికాకులు పడుతారు. స్నేహితులతో కొద్ది సేపు గడపండి. అనుకోని చోట నుంచి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. అక్కచెల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. సాయంత్రం నుంచి కొద్దిగా శుభకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.

Recent Posts

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

45 minutes ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

10 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

11 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

12 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

13 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

13 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

15 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

15 hours ago