Zodiac Signs : అక్టోబర్ 01 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : అక్టోబర్ 01 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Zodiac Signs :మేషరాశి ఫలాలు: ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబంలో కలతలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆదాయం తగ్గుతుంది. వైవాహిక జీవితంలో సర్దుబాటుకు ప్రయత్నించండి. మహాదేవుడి ఆరాధన చేయండి.వృషభరాశి ఫలాలు: శ్రమించాల్సిన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అనవసర ఖర్చులు వస్తాయి. క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మహిలలకు మంచిరోజు. శ్రీరామ జయరామ జయజయ రామ నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి. మిథునరాశి ఫలాలు: గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అనుకున్న […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 September 2022,10:40 pm

Zodiac Signs :మేషరాశి ఫలాలు: ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబంలో కలతలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆదాయం తగ్గుతుంది. వైవాహిక జీవితంలో సర్దుబాటుకు ప్రయత్నించండి. మహాదేవుడి ఆరాధన చేయండి.వృషభరాశి ఫలాలు: శ్రమించాల్సిన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అనవసర ఖర్చులు వస్తాయి. క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మహిలలకు మంచిరోజు. శ్రీరామ జయరామ జయజయ రామ నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి.

మిథునరాశి ఫలాలు: గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ఆఫీస్లో మీరు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు: ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. సోదరిలు, సోదరుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. క్రీడలలో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope October 1 2022 Check Your Zodiac Signs

Today Horoscope October 1 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు: ఈరోజు ఆదాయం తగ్గినా సమయానికి అవసరమైన ధనం చేతికి అందుతుంది. చెడువ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలుగవచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు: ఈరోజు కష్టాల నుంచి విముక్తి పొందడానికి కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు. శ్రమ భారం పెరిగినా బాధ్యతగా పనులు చేస్తారు. మిత్రులతో ఆర్ధికంగా ప్రయోజనాలను పొందుతారు. శ్రీ రుద్రపారాయణం చేయండి.

తులారాశి ఫలాలు: ఇంటివద్ద పనులతో బిజీగా గడుపుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. రోజంతా డల్గా ఉంటుంది. అనారోగ్యం. పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ ఉండదు. శ్రీ కృష్ణ ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు: ఈరోజు విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు. ప్రేమికులకు సంతోషమైన రోజు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. శ్రీ లక్ష్మీ,కుబేర ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు: ఇతరుల కోసం దూబరా ఖర్చు పెట్టకండి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ప్రయాణాలు కలసిరావు. మానసిక వత్తిడి ఉంటుంది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు: పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు చివరిదశకు వస్తాయి. ఆధ్యాత్మికలలో పాల్గొంటారు. అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి. శ్రీకృష్ణారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు: అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. ధనలాభాలు రాక ఇబ్బంది పడుతారు. వ్యాపారాలలో నష్టలు రావచ్చు. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. శ్రీ శ్వేతార్క గణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు: ఈరోజు అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. ఓర్పు ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులకు మంచి వార్తలు. అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది