Home » Devotional » Today Horoscope October 11 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : అక్టోబర్ 11 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 10, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి, ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మహిళలకు పనిభారం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని చక్కటి రోజు. ఇష్టమైన వారి నుంచి ఫోన్‌ కాల్‌ రావచ్చు. సాయంత్రం మీరు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : అనుకోని విధంగా మలుపులు తిరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. వివాదాలకు అవకాశం ఉంది. మహిళలకు దూర ప్రయాణ సూచన. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని వివాదాలు వస్తాయి. ఆఫీస్లో ఇబ్బందులు వస్తాయి. పనిభారం పెరుగుతుంది. ఆదాయం తగ్గుదల. వ్యాపారాలలో మందకొడిగా ఉంటుంది. మహిళలకు చికాకులు. విద్యా, ఉపాధి విషయాలలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. శ్రీ రామ తారక మంత్రాన్ని పారాయనం చేయండి.

Today Horoscope october 11 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : చక్కటి వాతావరణం కలిగిన రోజు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలకు ధనలాభాలు కలుగుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : చక్కటి ఆలోచనలు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాలలో జాయింట్‌ వ్యాపారాలకు అనుకూలం. ట్రేడింగ్‌, షేర్ మార్కెట్‌లో లాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు. చేసే పనులలో విజయం సాధిస్తారు.మహిళలకు ధనలాభాలు పొందుతారు. గోసేవ చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అన్నింటా ఇబ్బందులు వస్తాయి. కానీ చాకచక్యంగా తప్పించుకుంటారు. అన్ని పరిస్థితులు అశించినంతగా ఉండవు.. శ్రమ అధికం. వ్యాపార లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్యక ఇబ్బందులు . బంగారు ఆభరణాల విషయంలో జాగ్రత్త వహించాలి. మహిళలకు దననష్టం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు :  పనులలో వేగంగా పూర్తిచేస్తారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాయంత్రం మీకు వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. పిల్లల ద్వారా సంతోషం. మహిళలకు చక్కటి రోజు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనారోగ్య సమస్యలు. వ్యాపారాలలో నష్టాలు. అన్నింటా అపజయం సూచన. ఆర్థికంగా కొంత ఇబ్బంది. పెద్దల సహకారంతో ముందుకుపోతారు. బంధువులు, మిత్రులు మీకు సహాయపడుతారు. చివరకు చేసే పనలలలో విజయంసాధిస్తారు. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అన్నింటా ఆశించిన మేర ఫలితం రాకున్నా పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. ఈరోజు కీలక నిర్ణయాలు వాయిదా వేసుకోండి. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి.మహిళలకు చికాకులు పెరుగుతాయి. విద్యారు్థులకు శ్రమ భారం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయనం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : అన్నింటా చక్కటి శుభఫలితాలు సాదిస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం. సంతోషం, ఆనందం పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సాఫీగా లాభకరంగా ఉంటాయి..ఆస్తి వివాదాలు పరిష్కారం. మహిళలకు శుభయోగం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు ; అనుకోని ఇబ్బందులు కానీ అధిగమిస్తారు. కుటుంబంలో మార్పులు. చిన్నచిన్న సమస్యలు. ఆర్థికంగా సాధరణ స్తితి. విద్యా, ఉపాధి విషయంలో అనుకూలత తక్కువ. మిత్రుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి