Zodiac Signs : అక్టోబర్ 24 సోమవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేష రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. అనుకోని విధంగా ఈరోజు మంచి లాభాలు సాదిస్తారు. విందులు, వినోదాలలో అహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో చక్కటి లాభాలు. అమ్మతరపు నుంచి ధనసంబంధ ప్రయోజనాలు చేస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన ఇబ్బంది. అనుకోని విధంగా ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది కానీ అవసరానికి తగ్గ ధనం చేతికి అందుతుంది. ప్రయాణ సూచన. మహిళలకు లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా చక్కటి లాభాలు. వ్యాపారాలలో మంచి లాభాలు. ఆఫీస్‌లో, ఇంట్లో చక్కటి వాతావరణం. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. అప్పులు తీరుస్తారు.వ్యాపారాలలో లాభాలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మీరు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. మహిళలకు లాభాలు. శ్రీ దుర్గా, లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది కానీ ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ అనుకోని ఖర్చులు వస్తాయి. మానసిక ఆందోళన, వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు పనిభారం. ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : కొద్దిగా కష్టంతో, కొద్దిగా సంతోషంతో కూడిన రోజు. ఆర్థికంగా సాధారణం. అనుకోని చక్కటి శుభవార్తలు అందుతాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. వ్యాపారాలలలో ఇబ్బందులు. పనులలో ఆటంకాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో మీరు లాభాలు సాధిస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర వివాదాలకు అవకాశం ఉంది. పనులలో జాప్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. అనుకోని లాభాలు గడిస్తారు. మంచి వార్తలు వింటారు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. మహిళలకు ధనలాభాలు. శుభకరమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మంచి రోజు. పనులలో ఇబ్బంది తొలిగి సాఫీగా సాగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో, కుటుంబ సభ్యులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అన్నింటా మీకు జయం కలిగే రోజు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలల్లో లాభాలు. ఇంట్లో సంతోష వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా, బయటా మీకు అనుకూల ఫలితాలను పొందుతారు. శ్రీ ధనలక్ష్మీ ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ఆటంకాలతో కూడిన రోజు. పనులలో జాప్యం పెరుగుతుంది. అనవసర వివాదాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : చక్కటి రోజు. ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని తెలివితేటలతో అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ఇంట్లో పండుగ వాతావరణం. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ నారాయణ ,లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.