Home » Devotional » Zodiac Signs New Year 2022 Horoscope For Who Born In These Days
Devotional

Zodiac Signs 2022 : మీరు ఈ తేదీల్లో పుట్టారా? కొత్త సంవత్సరంలో మీకు చిక్కులు తప్పవు.. ఆ తేదీలు ఏంటో తెలుసుకోండి?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: January 1, 2022, 6:31 pm
Advertisement

Zodiac Signs 2022: కొత్త సంవత్సరం వచ్చేసింది. 2022కి అందరూ స్వాగతం పలికారు. ఈ సంవత్సరంలోనైనా అందరికీ శుభం కలగాలి అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా పీడ విరగడ కావాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే.. ఈ సంవత్సరం 2022 అంటే నెంబర్ 6. అన్నింటినీ కూడితే 6 వస్తుంది. ఈ సంవత్సరం శుక్ర గ్రహాన్ని సూచిస్తుంది.అంటే.. ఈ సంవత్సరం మొత్తం శుక్రుడి ప్రభావం ఉంటుందన్నమాట. నిజానికి ఈ సంవత్సరం కన్యారాశితో ప్రారంభం అవుతున్నా..

Advertisement

2022 ప్రారంభంలో చంద్రుడు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి కుజుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. కాబట్టి.. 2022లో శుక్రుడు, కుజుడు ఆధిపత్యం చూపించే రాశుల వాళ్లకు తిరుగే ఉండదు.1, 9, 10, 18, 27 తేదీల్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఫలితాలు అంతంత మాత్రమేనట. వీళ్ల జాతకంలో శుక్రుడు కానీ.. కుజుడు కానీ నీచంగా ఉంటే.. ఇక వీళ్లు ఏం మాట్లాడినా అది తప్పే అవుతుంది. వీళ్లు చాలా వివాదాల్లో చిక్కుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం వీళ్లకు కష్టాలే ఉంటాయి.

new year 2022 horoscope for who born in these days

Advertisement

Zodiac Signs 2022 : ఈ తేదీల్లో పుట్టిన వారికి కష్టాలు తప్పవు

అందుకే.. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీల్లో పుట్టిన వారి జాతకం బాగుండాలంటే.. ఖచ్చితంగా వీళ్లు తన బొటన వేలుకు ఒక వెండి ఉంగరాన్ని ధరించాలి. అలాగే లక్ష్మిని పూజించాలి. ప్రతి సంవత్సరం శ్రీసూక్తాన్ని పఠించాలి. అలా చేస్తే కాస్త మంచి ఫలితాలు కలుగుతాయి. నలుపు రంగు దుస్తులను వేసుకోకుండా.. క్రీమ్ కలర్ దుస్తులను, గులాబీ రంగు దుస్తులను ధరించడం మంచిది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి