Home » Hyderabad » A Big4 Employee In Hyderabad Reveals Her Monthly Expenses Breakdown
hyderabad

Big4 Employee Monthly Expenses : వామ్మో.. హైదరాబాద్‌లో నెలకు రూ.50 వేలు అద్దె.. లేడీ టెకీ నెల ఖర్చులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 4, 2026, 1:48 pm
Advertisement

Big4 Employee Monthly Expenses : హైదరాబాద్‌లో Hyderabad జీవించాలంటే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిరూపిస్తోంది తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త. ప్రపంచ ప్రఖ్యాత ‘Big4’ (అగ్రశ్రేణి ఆడిటింగ్/కన్సల్టింగ్) కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన నెలవారీ ఖర్చుల చిట్టాను బయటపెట్టారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఆమె.. హైదరాబాద్ బెస్ట్ అని చెబుతూనే, తన బడ్జెట్ వివరాలను పంచుకున్నారు.

Advertisement

Big4 Employee Monthly Expenses : వామ్మో.. హైదరాబాద్‌లో నెలకు రూ.50 వేలు అద్దె.. లేడీ టెకీ నెల ఖర్చులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Big4 Employee Monthly Expenses : నెలవారీ ఖర్చులు ఇవే.. అద్దె కోసమే రూ.50 వేలు

బీహార్‌కు చెందిన ఈ మహిళా ఉద్యోగి, గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం డెలాయిట్ (Deloitte)లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమెకు 11 ఏళ్ల అనుభవం ఉంది. తన భర్త, కూతురితో కలిసి నివసిస్తున్న ఆమె.. తన నెలవారీ ఖర్చులలో సింహభాగం ఇంటి అద్దెకే పోతోందని తెలిపారు.

Advertisement

ఆమె వెల్లడించిన ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి:

ఇంటి అద్దె (Rent): ఆమె తన కుటుంబంతో కలిసి ఒక 3BHK ఫ్లాట్‌లో నివసిస్తోంది. దీని కోసం ఆమె నెలకు అక్షరాలా రూ.50,000 అద్దె చెల్లిస్తున్నారు. ఇదే ఆమెకు ఉన్న అతిపెద్ద ఖర్చు.

పిల్లల చదువు (Education): కేవలం అద్దె మాత్రమే కాదు, తన కూతురి స్కూల్ ఫీజుల కోసం నెలకు సుమారు రూ.30,000 కేటాయిస్తున్నారు.

Advertisement

ఇంటి నిర్వహణ (Household): ఇక పనిమనిషి (House Help) కోసం నెలకు రూ.20,000, కరెంట్ బిల్లులు, ఇతర యుటిలిటీల కోసం రూ.10,000 ఖర్చు అవుతున్నాయి. అంటే ఇంటి నిర్వహణకే నెలకు రూ.30,000 వెళ్తున్నాయి.

కిరాణా సరుకులు (Groceries): వంటగది సరుకులు, ఇతర నిత్యావసరాల కోసం మరో రూ.15,000 ఖర్చు అవుతున్నాయని ఆమె తెలిపారు.

హైదరాబాదే బెస్ట్ అంటున్న టెకీ

హైదరాబాద్‌లో Hyderabad  స్థిరపడకముందు.. ఆమె ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు లాంటి టైర్-1 నగరాల్లో నివసించారు. ప్రతి నగరానికి లాభనష్టాలు ఉన్నప్పటికీ, ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ (Quality of Life) విషయంలో హైదరాబాద్ మిగతా నగరాల కంటే చాలా ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. భారీగా ఖర్చులు ఉన్నప్పటికీ, ఇక్కడ లభించే సౌకర్యాలు, జీవన విధానం తనకు నచ్చాయని ఆమె పేర్కొన్నారు.

వృత్తిపరంగా.. హెల్త్‌కేర్ క్లయింట్స్ కోసం ప్రాజెక్ట్ డెలివరీ, ప్రోగ్రామ్ గవర్నెన్స్ లాంటి బాధ్యతలను నిర్వహిస్తున్న ఆమె.. కెరీర్‌ని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హైదరాబాద్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఒక సామాన్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లేదంటే మధ్యతరగతి కుటుంబం హైదరాబాద్‌లో బతకాలంటే ఈ ఖర్చులు చూసి మాత్రం భయపడక తప్పదు.

Advertisement

సోషల్ మీడియాలో ఈ లెక్కలు చూసిన నెటిజన్లు.. “హైదరాబాద్ కూడా ఖరీదైన నగరంగా మారుతోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి