Corporator Venkatesh Goud : నూతన పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Corporator Venkatesh Goud : 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి లోని ఇందిరాగాంధీ స్టేట్యూ వద్ద మంజీరా పైప్ లైన్ పగిలి నిత్యం రోడ్డుపైకి నీరు రావడంతో కాలనీ వాసులు మరియు వ్యాపారులు గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న సమస్యను పరిష్కరించే విధంగా 17.20 లక్షల రూపాయల నిధులతో నూతన పైప్ లైన్ ను నిర్మించేందుకు డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు జల మండలి అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.
Corporator Venkatesh Goud : నూతన పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ గారు మరియు జల మండలి అధికారుల సహకారంతో సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుందని అన్నారు.
ఇంతకు ముందు ఉన్న పైప్ లైన్ పగలడంతో సమస్య ఏర్పడిందని, పైప్ లైన్ డివైడర్ కింద ఉండడంతో మరమ్మత్తు చేయడానికి వీలు లేకుండా పోయిందని, సుమారు నూటయాభై మీటర్లు నూతన పైప్ లైన్ ను నిర్మించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలియచేసారు. కార్యక్రమంలో నాయకులు గుడ్ల శ్రీనివాస్, గోపాల్, లింగం, రమేష్, నాగార్జున, వాటర్ వట్క్స్ మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ మరియు శివ తదితరులు పాల్గొన్నారు.
