Home » Hyderabad » Distribution Of Sanction Documents For Indiramma Houses In Ghatkesar
hyderabad

Indiramma Houses : ఘట్కేసర్‌లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 24, 2026, 10:00 pm
Advertisement

Indiramma Houses : ఈ రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్‌లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఘనంగా అందజేశారు. మేడ్చల్ నియోజకవర్గం డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు హౌసింగ్ బోర్డు AE ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్, B బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ , పట్టణ అధ్యక్షులు ముత్యాలు యాదవ్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ద్వారా 40 నుంచి 100 గజాల వరకు స్వంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Indiramma Houses : ఘట్కేసర్‌లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ

లబ్ధిదారులకు నాలుగు దశల్లో నగదు విడుదల చేస్తూ ముఖ్యంగా L1 (స్థలం ఉండి ఇల్లు లేనివారు) జాబితాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా మంజూరు పత్రాలు అందని వారు మున్సిపల్ కార్యాలయం లేదా ఇందిరమ్మ కమిటీ సభ్యులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించి అర్హులైన లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసి పట్టాలు మరియు ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, SC సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, మొయినార్టీ అధ్యక్షులు ఫరూక్, ఉపాధ్యక్షులు వాజీత్, యూత్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, sc సెల్ ప్రధాన కార్యదర్శి సునీల్, నాయకులు సిరాజ్, రెహమాన్, కాయుమ్, కడుపొల్ల రాజు, నర్సింగ్ రావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, శ్రీనివాస్, తోక రాజు, సత్తి రెడ్డి, విజయ్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి