
ganja chocolates rocket busted in hyderabad
Hyderabad : సాధారణంగా చాక్లెట్లు అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎంతమంది ఉంటారు. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అందుకే.. మార్కెట్ లోకి సరికొత్తగా కేటుగాళ్లు గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చారు. సాధారణంగా గంజాయిని సరఫరా చేస్తే పోలీసులు పట్టుకుంటారని.. స్మగ్లర్లు పలు రకాల స్కెచ్ లు వేస్తారని తెలుసు కదా. అందులో భాగంగానే గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చారు.
ganja chocolates rocket busted in hyderabad
చాక్లెట్లను చూస్తే ఎవ్వరికీ అనుమానం రాదని.. వాటిని హైదరాబాద్ మార్కెట్ లో దర్జాగా అమ్ముతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలనే టార్గెట్ గా చేసుకొని గంజాయిని చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు. తాజాగా ఒక పాన్ షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన షాద్ నగర్ పోలీసులు వెంటనే దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్ల గుట్టును రట్టు చేశారు.
ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయిని చాక్లెట్ల రూపంలో తీసుకొచ్చి నగరంలో ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసుకొని విక్రయిస్తున్నారు. వెంటనే పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన షాద్ నగర్ పోలీసులు.. గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు గంజాయి స్మగ్లర్లను కూడా పట్టుకున్నారు. సాధారణంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తే పోలీసులకు దొరికిపోతారని.. ఇలా పలు విధాలుగా తమ క్రియేటివిటీని ఉపయోగించి గంజాయి స్మగ్లర్లు చెలరేగిపోతున్నట్టు తెలుస్తోంది.
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్‌లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది.…
Watermelon : వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడంలో, దాహం తీర్చడంలో పుచ్చకాయ…
Marriage : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు, పూజలు, శుభకార్యాల్లో…
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. కీలక మ్యాచ్‌లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్‌లపై ఆధారపడుతుంటే,…
This website uses cookies.