Home » Hyderabad » Sir Process Uppal Mandumula Parameshwar Reddy
hyderabad

M Parameshwar Reddy : ఉప్పల్‌ SIR ప్రక్రియపై మందుముల పరమేశ్వర్ రెడ్డి కీలక ఆదేశాలు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 18, 2026 5:48 pm
Advertisement

M Parameshwar Reddy  : ఉప్పల్ Uppal నియోజకవర్గంలో SIR Process (సర్ ప్రక్రియ) సాఫీగా, పారదర్శకంగా, వేగంగా పూర్తయ్యేలా ప్రతి కాంగ్రెస్ Congress కార్యకర్త కృషి చేయాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి Mandumula Parameshwar Reddy పిలుపునిచ్చారు. నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయ కేంద్రాలు SIR Help Centers  సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. భారత్ నగర్ Bharat Nagar లోని విజేత స్కూల్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఈగ ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SIR Help Center సర్ సహాయ కేంద్రం ను మందుముల పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓటర్లతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు.

Advertisement

M Parameshwar Reddy : ఉప్పల్‌ SIR ప్రక్రియపై మందుముల పరమేశ్వర్ రెడ్డి కీలక ఆదేశాలు..!

M Parameshwar Reddy : BLOలతో సమన్వయం చేసుకుంటూ సేవలు అందించాలి

ఈ సందర్భంగా మాట్లాడిన మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, SIR Process సర్ ప్రక్రియ లో నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి సహాయ కేంద్రంలో ప్రజలకు సరైన మార్గనిర్దేశం చేయాలని, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే BLO Booth Level Officer లతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఓటరికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

Advertisement

M Parameshwar Reddy  ప్రజలకు మరింత చేరువ కావాలని సూచన

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, SIR Help Centers  సర్ సహాయ కేంద్రాలు ప్రజలకు నిజమైన సహాయక కేంద్రాలుగా మారాలని అన్నారు. ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించేలా కార్యకర్తలు పనిచేయాలని, ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సెల్ అధ్యక్షుడు లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి, సల్లా ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అఫ్గల్, బుత్కూరి మదన్ గౌడ్, నవీన్, రామ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కోమట్ రెడ్డి కృష్ణ రెడ్డి, ఇర్షాద్, నయీం, అఫ్రోజ్, ఆసిఫ్, వాహెద్, బంటి, ఈశ్వర్, విజయ్, మోసిన్, శ్రీనివాస్, మోహన్ నాయక్తో పాటు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి