Home » Hyderabad » Student Organizations Lay Siege To Secretariat Over Fee Reimbursement Dues
hyderabad

Fee Reimbursement : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సచివాలయం ముట్టడి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 14, 2026 5:12 pm
Advertisement

Fee Reimbursement : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ Fee Reimbursement , స్కాలర్‌షిప్స్ Scholarships  బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన ‘చలో సెక్రటేరియట్ Chalo Secretariat కార్యక్రమం మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు సచివాలయం వైపు భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు AISF, SFI, PDSU, AIFDS, AISB, AIDSO, AIPSU వంటి పలు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. విద్యార్థుల పోరాటంతో సచివాలయం పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారగా, భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Advertisement

Fee Reimbursement : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సచివాలయం ముట్టడి..!

Fee Reimbursement, Scholarships విడుదల చేయాలని డిమాండ్

విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన Fee Reimbursement మరియు Scholarships బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని ఆరోపించారు. ఈ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువులు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు.

Advertisement

విద్యార్థుల అరెస్టులపై సంఘాల ఆగ్రహం

సచివాలయం వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేయడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం సరికాదని నాయకులు విమర్శించారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న Fee Reimbursement మరియు Scholarships బకాయిలను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి