Home » Hyderabad » Urdu Paper Managing Editor Died In Gaddar Final Rites
hyderabad

Gaddar Final Rites : గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో ఆ పత్రిక ఎడిటర్ మృతి?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: August 7, 2023 7:26 pm
Advertisement

Gaddar Final Rites : గద్దర్ అంత్యక్రియలు అల్వాల్ లోని మహాబోధి స్కూల్ లో జరుగుతున్నాయి. దీంతో గద్దర్ అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. గద్దర్ అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు కూడా భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే.. మహాబోధి స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. భారీ సంఖ్యలో గద్దర్ అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉండటంతో వాళ్లను అదుపు చేయడం పోలీసుల వల్ల కావడం లేదు.

Advertisement

దీంతో స్కూల్ లోపలికి వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. అక్కడ అంత స్థలం లేదని ప్లేస్ సరిపోదని పోలీసులు చెప్పినా వినకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పాటు భారీ తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయినట్టు తులస్తోంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Gaddar Final Rites : చనిపోయింది ఆయనేనా?

అయితే.. చనిపోయింది సియాసత్ అనే ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ అని చెబుతున్నారు. దానిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. పోలీసులు అయితే ఇంకా అధికారికంగా ఎవరు చనిపోయారో నిర్ధారణ చేయలేదు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి