Success Story : ఒక యువతి కోటి రూపాయల జాబ్ వదిలేసి సొంత కంపెనీ పెట్టి కోట్లలో ఆర్జిస్తుంది. ఆమెకున్న లక్ష్యం క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగం పొందని వారికి దారి చూపించడం. ఆమె పది లక్షల మందికి దారి చూపించింది. ఇవాళ ఆమె దయ వలన విదేశాల్లో చాలామంది మంచి ప్యాకేజీతో జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆమె పేరు ఆరుషి అగర్వాల్. వయసు 27. స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా. ప్రస్తుతం ఘజియాబాద్ జిల్లాలోని నెహ్రూ నగర్ లో నివసిస్తున్నారు. చిన్న వయసులోనే కంపెనీ పెట్టి మూడేళ్లలో 50 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగిన మహిళ వ్యవస్థాపకురాలిగా పేరు సంపాదించుకున్నారు. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఈమె ఐఐటి ఢిల్లీలో ఇంటర్న్షిప్ చేశారు.
రెండుసార్లు కోటి రూపాయల ప్యాకేజీతో ఆఫర్ వస్తే ఆమె సున్నితంగా రిజెక్ట్ చేశారు. లక్ష రూపాయలతో కంపెనీ ప్రారంభించారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవ్వని వారికి సహాయం చేసేలా ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు. దీనికోసం ఆమె కోడింగ్ నేర్చుకున్నారు. 2020 టాలెంట్ టీక్రిప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. గత మూడేళ్లలో ఈమె సాఫ్ట్వేర్ వేదిక ద్వారా 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. వీళ్లంతా అమెరికా, జర్మనీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ సాఫ్ట్ వేర్ ప్లాట్ఫారంలో హ్వాకథాన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ వర్చువల్ స్కిల్ టెస్ట్ అటెండ్ చేయవచ్చు. ఈ టెస్ట్ లో పాస్ అయితే నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరు అవచ్చు.
చాలా యూనివర్సిటీలు ఈ సాఫ్ట్వేర్ సేవలను పొందుతున్నారు. ఇది చాలా స్పెషల్ సాఫ్ట్వేర్. మోసం చేసే అవకాశం అసలు ఉండదు. స్కిల్ టెస్ట్ సమయంలో ఇతర డివైస్లు ఉపయోగించి లేదా ఇతరుల సహాయం తీసుకుని పాస్ అయ్యే అవకాశం ఉండదు. జెన్యూన్ గానే ఉంటుంది. ఇక ఈమె ఐఐఎం బెంగుళూరు నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం పూర్తి చేశారు. దేశంలోనే టాప్ వ్యవస్థాపకులలో ఒకరిగా భారత ప్రభుత్వం చేత అవార్డు కూడా పొందారు. నోయిడా లో ఉన్న ఈమె కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈమె తన తాతయ్య ఓం ప్రకాష్ గుప్తాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈమె తండ్రి అజయ్ గుప్తా ఒక వ్యాపారవేత్త మరియు ఈమె తల్లి గృహిణి. తెలివితేటలు ఉంటే ఒక్క లక్షతో 50 కోట్లు 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చని ఈ యువతి నిరూపించింది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.