AP government has given good news to expectant mothers
Good News : ఏపీ ప్రభుత్వం కాబోయే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది. పేద వారికి, ఆర్థికంగా వెనకబడిన వారికి సంక్షేమ పథకాలను అందిస్తుంది. ఇప్పటికే గర్భిణీలకు బాలింతలకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులను అందిస్తుంది. అయితే జులై 1 నుంచి సరుకులను నేరుగా వారి ఇంటికే సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న సరుకులను జులై నుంచి నేరుగా బాలింతలు, గర్భిణీల ఇంటికి వెళ్ళనున్నాయి. బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు, నూనె, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం వంటి సరుకులు పంపిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం గర్భిణీలకు ఆ వైద్య సేవలను ఉచితంగా అందిస్తుంది.
AP government has given good news to expectant mothers
గర్భిణీల కోసం ఉచితంగా అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలిస్ టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గర్భిణీలు 18 నుంచి 22 వారాల దశలో టిఫా స్కానింగ్ చేయించుకోమని వైద్యులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పిండం ఎదుగుదలలో ఏమైనా లోపాలు ఉంటే గుర్తించడం ఉపయోగపడుతుంది. ఈ స్కానింగ్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యులు గర్భిణీలకు సూచనలు చేస్తారు. ఈ స్కానింగ్ కి 1100 ఖర్చు అవుతుంది. అయితే దీనిని ప్రభుత్వమే భరిస్తుంది. అలానే అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ కి 250 చొప్పున ప్రభుత్వం పెట్టుకుంటుంది.
ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆసుపత్రులలో ఈ టిఫా స్కానింగ్ ఉచితంగా నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేద, మధ్యతరగతి గర్భిణీలు ఒక టిఫా స్కానింగ్, రెండు అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ లు ఫ్రీగా చేస్తారు. గతేడాది ఆరోగ్యశ్రీ కార్డు కింద 2.31 లక్షల మంది గర్భిణీలు ప్రసవ సేవలు పొందారు. టిఫా, ఆల్ట్రా సోలోగ్రామ్ స్కానింగ్ చేయడానికి అవసరమైన విధానాలను ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆరోగ్యశ్రీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వస్తున్న ఈ సేవలను గర్భిణీ స్త్రీలు ఆన్లైన్లో నమోదు చేసుకొని వినియోగించుకోవాలని అన్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.