Home » Inspirational » Farmer Comes In An Audi Car And Sells Vegetables
Inspirational

Farmer : ఆడీ కారులో వచ్చి కూరగాయలు అమ్ముతున్న రైతు .. నోరెళ్ళబెడుతున్న జనం..!

Authored By
aruna
The Telugu News | Published on: October 2, 2023, 1:00 pm
Advertisement

Farmer : రైతు పంటను పండించడానికి ఎన్ని ఇబ్బందులు పడతాడో, వాటిని మార్కెట్ కు తీసుకెళ్లి సరైన ధరకు అమ్మేందుకు ఇంకా మరిన్ని కష్టాలు పడతాడు. వారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పటికో కానీ రాదు. అప్పుల బాధతో ఎంతోమంది రైతులు ప్రాణాలను విడిచిన ఘటనలు మనం ఎన్నో చూసాం. అయితే అందరి రైతుల కాకుండా కేరళకు చెందిన ఓ రైతు తన వ్యవసాయాన్ని లాభాల వైపు తీసుకెళుతున్నారు. ఏకంగా ఆడీ కారులో మార్కెట్ కి వెళ్లి తన పంటను అమ్ముకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

కేరళకు చెందిన సుజిత్ అనే రైతు ఇంస్టాగ్రామ్ లో చాలా పాపులర్. లేటెస్ట్ టెక్నాలజీతో తన వ్యవసాయాన్ని పండిస్తూ అద్భుత లాభాలను రాణిస్తున్నారు. అతడికి ఇన్ స్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్ లు ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సుజిత్ ఆడీ కారులో మార్కెట్ కు వచ్చి పంచె, బూట్లు విప్పి కారులో పడేసాడు. ఆ తర్వాత కింద ఒక చాపపరిచి అందులో ఆకుకూరలు వేసి అమ్మడం ప్రారంభించాడు.దీంతో సుజిత్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోని ఇప్పటివరకు దాదాపుగా 5 లక్షల మంది వీక్షించారు.

farmer comes in an Audi car and sells vegetables

Advertisement

సుజిత్ పై నెటిజన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. నిజాయితీగా కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు, ఆ ఆడీ కారు వెనుక అతడి నిజాయితీ, కష్టం ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. ఇక సుజిత్ వ్యవసాయానికి సంబంధించి తరచుగా ఎన్నో వీడియోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. అవి బాగా వైరల్ అవుతుంటాయి కేరళలో ఇతడు చాలా ఫేమస్ . చాలామందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి