Inspiration : అలోక్ త్రిపాఠి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాకు చెందిన స్కూల్ హెడ్ మాస్టర్. గత సంవత్సరం లాక్ డౌన్ విధించిన తర్వాత అందరూ ఇంట్లో ఉంటే.. ఈయన మాత్రం.. స్కూల్ కు వెళ్లేందుకు తెగ ప్రయత్నించారు. అధికారుల కాళ్లు పట్టుకొని మరీ.. పర్మిషన్ తీసుకొని లాక్ డౌన్ టైమ్ లో కూడా ప్రతి రోజు స్కూల్ కు వెళ్లేవారు. అదేంటి. లాక్ డౌన్ సమయంలో స్కూళ్లు లేవు కదా. మరి.. ఈయన స్కూల్ కు వెళ్లి ఏం చేసేవారు.. అనే డౌట్ మీకే కాదు.. అధికారులకు కూడా వచ్చింది. ఆయన స్కూల్ కు వెళ్లేందుకు పర్మిషన్ కావాలి.. అని అడిగింది.. మొక్కలకు నీళ్లు పోయడం కోసం. అవును.. తన ప్రాణం కంటే ఎక్కువగా స్కూల్ లో మొక్కలు నాటి.. వాటిని తన పిల్లల్లా పెంచుతున్నారు ఈ హెడ్ మాస్టర్. అసలే లాక్ డౌన్.. ఆపై ఎండాకాలం. వాటికి నీళ్లు పోయకపోతే.. మొక్కలు ఎండిపోతాయని.. లాక్ డౌన్ సమయంలో పోలీసులను, అధికారులను బతిలాడి మరీ.. రోజూ స్కూల్ కు వెళ్లి కరోనాను సైతం లెక్క చేయకుండా.. మొక్కలను నీళ్లు పోసి వచ్చేవారు. అది మొక్కల మీద ఆయనకున్న ప్రేమ.
ఇప్పుడు కాదు.. 20 ఏళ్ల కిందనే తను పనిచేసే స్కూల్ లో మొక్కలు నాటారు అలోక్. మొత్తం మూడున్నర ఎకరాల్లో న్న స్కూల్ అప్పుడు ఒక ఎడారిలా ఉండేది. స్కూల్ బిల్డింగ్ లు తప్పితే ఎక్కడా నిలువ నీడ లేదు. ఒక్క చెట్టు లేదు. అది ఒక స్కూల్ లా లేకపోవడంతో.. దాన్ని ఎలాగైనా మార్చాలనుకున్నారు. దాన్ని ఒక పచ్చని వనంలా మార్చాలనుకున్నారు.
తన చిన్నతనంలో ఒకసారి ఎక్స్ కర్షన్ వెళ్లినప్పుడు తన టీచర్.. చెట్ల విలువను చెప్పడంతో.. అప్పటి నుంచి చెట్లను నాటడమే ధ్యేయంగా పెట్టుకున్నారు అలోక్. తను స్కూల్ లో టీచర్ గా జాయిన్ కాగానే.. మొక్కలు నాటడం ప్రారంభించినప్పటికీ.. స్కూల్ కు గోడ లేకపోవడంతో.. మొక్కలను ఎవరైనా తెంచేయడం, బర్రెలు, గొర్రెలు లాంటివి వచ్చి.. వాటిని తినేయడం జరిగేది.
దీంతో.. అక్కడి స్థానిక నాయకులను కలిసి.. స్కూల్ కు గోడ నిర్మించాలని రిక్వెస్ట్ చేసి.. స్కూల్ గోడను నిర్మించేలా చేసి.. అప్పుడు మొక్కలు నాటడం ప్రారంబించారు అలోక్.
2000 సంవత్సరంలో పండ్ల మొక్కలు, ఇతర ఔషధాల మొక్కలు నాటడం ప్రారంభించారు అలోక్. అలా.. 20 ఏళ్ల పాటు.. మొక్కలను నాటుతూ.. ప్రస్తుతం స్కూల్ ను ఒక పచ్చని వనంలా మార్చారు. ప్రస్తుతం ఆ స్కూల్ గ్రౌండ్ లో 240 రకాల మొక్కలు ఉన్నాయి. వాటిలో పండ్ల చెట్లు అయినటువంటి మామిడి, జామ చెట్లతో పాటు, నిమ్మ చెట్లు, తులసి చెట్లు, అశ్వగంధ చెట్లు, కరివెపాకు, ఇతర చెట్లను నాటారు.
ఇదివరకు ఎడారిలా ఉన్న స్కూల్.. ఇప్పుడు పచ్చని వనంలా మారడంతో స్కూల్ కు రావడానికి చాలామంది పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. స్కూల్ మొత్తం ఒక పార్కులా పచ్చని చెట్లతో నిండి ఉండటంతో.. విద్యార్థులు ఎంతో సంతోషంతో స్కూల్ లో అడుగుపెడుతున్నారు. పచ్చిన చెట్ల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్నారు.
నేను ఇక రిటైర్ అయినా నాకు బాధ లేదు. నేను రిటైర్ అయ్యాక కూడా ఈ చెట్ల బాధ్యతను నా విద్యార్థులు చూసుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది.. ఈ స్కూల్ విధ్యార్థులకు, చెట్లతో ఉన్న అనుబంధం అటువంటిది.. అందుకే నాకు ఎటువంటి టెన్షన్ లేదు.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు అలోక్.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.