Wife Sacrifice : ఎవరైనా సరే.. సంతోషంగా జీవించాలని అనుకుంటారు. డబ్బులు లేకున్నా పర్వాలేదు కానీ.. మంచి ఫ్యామిలీ ఉంటే చాలు. హాయిగా బతికేయొచ్చు. అయితే.. జీవితం అనేది ఎప్పుడూ ఎలా అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అదే కదా జీవితం అంటే. ఆ దేవుడు కొన్ని కుటుంబాలను చూసి ఓర్వలేడు. అందుకే వాళ్లకు ఏదో ఒక ప్రమాదం జరిగేలా చేస్తాడు అని అంటారు. అలా సంతోషంగా, హ్యాపీగా బతుకుతున్న ఫ్యామిలీల మధ్య చిచ్చు పెడతాడు. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది.
ఒక వ్యక్తి కింద పడటంతో వెన్నెపూస విరిగిపోయింది. కాళ్లు చచ్చుబడిపోయింది. దీంతో అతడికి ట్రీట్ మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేవు. చికిత్స కోసం అప్పటికే ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి. అప్పులు చేసి ట్రీట్ మెంట్ చేయించినా కూడా బాగు పడడు అని చెప్పారు డాక్టర్లు. ఇప్పటికే 8 లక్షలు ఖర్చు అయ్యాయి. ఇంకో మూడు నాలుగు లక్షలు అవుతాయి. అయినా కూడా ఆయన బాగు అవుతాడో లేదో తెలియదు. అందుకే.. తన భర్తను భుజాల మీద మోస్తూ ఆసుపత్రికి తీసుకెళ్తోంది భార్య. తమకు అంతో ఇంతో సాయం చేయాలని కోరుతోంది.
తన భర్త వైద్యం కోసం చాలా అప్పులు చేసింది ఆ భార్య. 24 గంటలు తన భర్తను భుజాల మీద మోస్తూ ఉంటుంది. తనను అలా చూసి అందరూ చలించిపోతున్నారు. 10 ఏళ్ల నుంచి ఇలాగే తన భర్తను మోస్తూ ప్రేమకు అసరైన నిర్వచనాన్ని ఆ భార్య చూపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పెళ్లయిన 4 ఏళ్లకే ప్రమాదంలో వెన్నెపూస విరిగిపోవడంతో తన భుజాల మీద మోస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తూ లక్షల రూపాయలు తన భర్తకు ట్రీట్ మెంట్ కోసం వెచ్చించింది. తన భర్త ఎలక్ట్రికల్ షాపులో పని చేసేవాడు. ప్రమాదంలో వెన్నెపూస విరిగిపోవడంతో అప్పటి నుంచి ఆయన నడవలేకపోతున్నాడు. పనిమనిషిగా కొన్ని ఇండ్లలో పని చేస్తూ వచ్చే డబ్బులతో తన భర్తకు ట్రీట్ మెంట్ చేయిస్తూ, పిల్లలను చదివిస్తున్న ఆ మహిళకు నెటిజన్లు హేట్సాఫ్ అంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.